- జనగామ జిల్లా న్యాయమైన కోరిక
- టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క
నిజాం పాలనను మరిపిస్తున్నారు
Published Sat, Aug 13 2016 12:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
జనగామ : నిజాం నిరంకుశ పాలనను మరిపిస్తూ తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. పట్టణంలోని గాయత్రి గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. గడీల పాలనను సాగిస్తున్న పాలకులు గల్లీ బిడ్డలను ఎదగకుండా అణచివేస్తున్నారని ఆరోపించా రు.
ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చే స్తున్నారని అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరిట నాలుగు గ్రామాలను ముంచేందుకు 123 జీ వోను తీసుకొచ్చిన ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసినా బుద్ధి రావడం లేదన్నారు. హరితహారం పేరుతో సినిమా చూపిస్తూ అధికారులను ప్రజాపాలనకు దూరం చేస్తున్నారని అన్నారు.
బ్యాంకు రుణాలు రైతులు ఇ బ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఎంసెట్ పేపర్ లీక్ విషయంలో విద్యార్థులకు రెండవ సారి అగ్నిపరీక్ష పెడుతున్న కేసీఆర్, అందుకు బాధ్యులైన మంత్రులు కడియం, లక్ష్మారెడ్డిలను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. జనగామ జిల్లా ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ మధుసూధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్లూరి అశోక్, పట్టణ అధ్యక్షులు పోకల లింగయ్య, నాయకులు బొట్ల శ్రీనివాస్, బెడిదె మైసయ్య, చీకట్ల నవీన్, రామిని హరీష్, మిద్దెపాక స్టాలిన్, మండల పార్టీల అధ్యక్షులు ఎలికట్టె మహేందర్‌గౌడ్, పర్శరాములు, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, ఆకుల దుర్గాప్రసాద్, కొత్తపల్లి సమ్మయ్య, కొత్తపల్లి కాశీపతి, అల్లాదుర్గం వెంకటేశ్వర్లు, గడ్డం క్రిష్ణ, రత్నం, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement