నిజాంను పొగిడితే ఊరుకోరు | Nizam did raved about | Sakshi
Sakshi News home page

నిజాంను పొగిడితే ఊరుకోరు

Published Thu, Sep 3 2015 2:49 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

నిజాంను పొగిడితే ఊరుకోరు - Sakshi

నిజాంను పొగిడితే ఊరుకోరు

పొల్సాని మురళీధర్‌రావు

 పరకాల: ‘కేసీఆర్ మీరు చెప్పినట్లుగా నిజాం ఆదర్శ పాలనపై చర్చించేందుకు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా.. నిజాం గుణగణాలపై పరకాల చౌరస్తాలో మాట్లాడుకుందాం.. చరిత్రను వక్రీకరించి నిజాంను పొడిగితే బట్టలూడదీసి కొడతారు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు హెచ్చరించారు. అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని బుధవారం అమరధామంలో అమరవీరులకు నివాళులు అర్పించారు.

మళ్లీ జమిందారి వ్యవస్థకు ప్రాణం పోసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అధికారం కోసం దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లితే ఖబర్దార్ అని హెచ్చరించారు.  కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం ఒకే దారిలో నడుస్తున్నాయన్నారు. తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement