రాజరిక వ్యవస్థకు ప్రతినిధిగా, నిజాం నవాబులకు వారసునిగా సీఎం కేసీఆర్ వ్యవహారశైలి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: రాజరిక వ్యవస్థకు ప్రతినిధిగా, నిజాం నవాబులకు వారసునిగా సీఎం కేసీఆర్ వ్యవహారశైలి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత ఇద్దరు సీఎంలు, రెండు లోగోలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. సచివాలయాన్ని కూల్చేసి, చాతీ ఆసుపత్రిని అడవుల్లోకి పంపించడం మంచిదికాదన్నారు. ఫాస్ట్‌ను ఉపసంహరించి మళ్లీ ఫీజుల రీయింబర్స్‌మెంట్ అనడం కేసీఆర్ అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు.