పోలీసుల ఆదేశాలు పాటించండి | follow police orders | Sakshi
Sakshi News home page

పోలీసుల ఆదేశాలు పాటించండి

Published Wed, Sep 7 2016 12:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

follow police orders

– గణేష్‌ మండప నిర్వాహకులకు ఎస్పీ ఆదేశం
 
కర్నూలు:
వినాయక చవితిని పురస్కరించుకుని గణేష్‌ మండలి సభ్యులు పోలీసులు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు, నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎస్పీ రవికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నిబంధనలు పాటించని మండపాల నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
సూచనలు:
– వినాయక నిమజ్జనానికి వెళ్లే యువకులు, పిల్లలకు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తెలియజేయాలి.
– ఈత వచ్చిన వారే నిమజ్జనానికి వెళ్లాలి.
– నిమజ్జనం ప్రాంతానికి పిల్లలు వెళ్లకుండా చూడాలి.
– యువకులు మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు.
– సంబంధం లేని వ్యక్తులపై రంగులు చల్లే ఆకతాయిలపై చర్యలు.
– నిమజ్జన సమయంలో సాహసాలు చేయరాదు.
– ప్రజలకు అసౌకర్యం కలుగకుండా రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌ స్పీకర్లు ఆపేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement