షాద్‌నగర్ రూరల్ : ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేయాలని పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
నిబంధనల మేరకు వసూలు చేయాలి
Published Wed, Aug 17 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
షాద్‌నగర్ రూరల్ : ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేయాలని పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలును నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లితండ్రులపై భారం మోపుతున్నారన్నారు. ప్రభుత్వం ఆదేశించిన నిర్ణీత ఫీజుల కన్నా అధిక ఫీజులను వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా ఆటస్థలం, వ్యాయామ ఉపాధ్యాయులు లేకుండా ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నారన్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్, విహారయాత్రల పేరిట అధిక డబ్బులను వసూలు చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల అర్హతలను నోటీసు బోర్డుపై ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో తల్లితండ్రుల కమిటీలను ఏర్పాటు చేసి నెలనెల సమావేశాలను నిర్వహించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కుమార్, తిరుపతయ్య, శ్రీను, గోపాల్, వెంకటేష్, విజయ్‌కుమార్‌గౌడ్‡ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement