ఆ సీట్లు వారివే : ఎయిర్ఇండియా
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా జంప్ సీట్ల జారీలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా జంప్ సీట్ల జారీలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ఇండియా విమానంలో గత వారం జరిగిన ఓ సంఘటనతో ఎయిర్ఇండియా కదలివచ్చింది. అలసట కారణంగా ఓ ఉద్యోగి విమానంలో కింద పడుకుంది. వారికి కేటాయించిన సీట్లను ఇతర ప్యాసెంజర్లు వాడుకోవడంతో ఈ ఇబ్బంది తలెత్తింది. దీన్ని సీరియస్గా తీసుకున్న ఎయిర్ఇండియా సిబ్బంది తమ అభీష్టానుసారం జంప్ సీట్లలో ట్రావెల్ చేయడానికి అనుమతి ఉంటుందని ఆ కంపెనీ పైలెట్లకు తెలిపింది. దీర్ఘకాల ప్రయాణాల్లో సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి జంప్ సీట్లను విడుదల చేయాలని ఫైలెట్స్-ఇన్-కమాండ్లలను ఆదేశించింది. తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ గతవారం ఓ సిబ్బంది కింద పడుకోవడంపై బాధను వ్యక్తంచేసింది.
ఈ విషయంపై సీరియస్గా స్పందించిన ఎయిర్ఇండియా యాజమాన్యం ఓ ముగ్గురు సిబ్బందితో పాటు ఇద్దరు ఎయిర్హోస్టస్ను సస్పెండ్ చేసింది. దీంతో ఎయిర్ఇండియా జంప్సీట్లలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నట్టు ఓ సర్క్యూలర్ జారీచేసింది. ఎయిర్లైన్ స్టాఫ్, ఎయిర్క్రాప్ట్లో విశ్రాంతి కోసం తప్పనిసరిగా జంప్ సీట్లనే వాడుకోవాలని పేర్కొంది. ఈ సీట్లను వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, పిల్లలకు ఇవ్వకూడదని ఎయిర్ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) క్యాపిటన్ అరవింద్ కథ్పాలియా తెలిపారు. జంప్ సీట్ను కేటాయించే బాధ్యత పైలెట్ ఇన్ కమాండ్కే ఉంటుందని స్పష్టంచేశారు.