ఢిల్లీ: మణిపూర్ అంశంపై నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా కేంద్రం కూడా అందుకు సమ్మతించింది. కానీ రూల్ నెంబర్ 267 కింద మణిపూర్ అంశాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం రూల్ నెంబర్ 176 కింద చర్చిస్తామని స్పష్టం చేసింది. మణిపూర్ అంశంపై అరగంట చర్చ సరిపోదని, రూల్ 267 కింద చర్చ జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
కేంద్రం ఇందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు. అయితే.. ప్రతిపక్షాలు పదే పదే తమ నిర్ణయాన్ని మారుస్తున్నాయని కేంద్రం మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. కేవలం ప్రధాని మోదీ వచ్చి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాయని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తి ప్రతిపక్షాలకు లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. అసలు ఈ రూల్ నెంబర్ 176, 267 రెండు నిబంధనల మధ్య ఉన్న తేడా ఏంటీ?
#WATCH | Defence Minister Rajnath Singh on the Manipur violence says, "I feel the opposition is not serious about the discussion on the Manipur issue. The government wants to discuss the Manipur issue. PM Modi himself said that the country is ashamed of whatever has happened in… pic.twitter.com/GlTZ3sj9uM
— ANI (@ANI) July 21, 2023
ఇదీ చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు
రూల్ 267 ప్రకారం..
రాజ్య సభ నిబంధనల ప్రకారం రూల్ 267కు ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద ప్రత్యేకంగా చర్చ జరపాలని సభ్యులు కోరవచ్చు. ఇందుకు ఆ రోజు సభలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఇతర సభ్యులు ఇచ్చిన నోటీసులు తాత్కాలికంగా రద్దు చేయాలని కోరుబడతాయి. ప్రత్యేక చర్చకు సభ్యుడు నోటీసు ఇస్తే.. స్పీకర్ అనుమతించాల్సి ఉంటుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాన్ని రాతపూర్వకంగా కానీ, ఓరల్‌గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చర్చలో సభ్యులు ఏ అంశంపైనైనా అడగవచ్చు. 1990 నుంచి 2016 వరకు కేవలం 11 సార్లు మాత్రమే ఈ రూల్ కింద చర్చ జరిగింది.
రూల్ 176 ప్రకారం..
ఈ రూల్ ప్రకారం చర్చ అరగంట నుంచి రెండున్నర గంటలపాటు మాత్రమే ఉంటుంది. సభలోని ప్రతి సభ్యుడు ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశంపై చర్చించేందుకు నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయాల‍్సి ఉంటుంది. ఆ నోటీసుకు మద్దతుగా ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. ఈ నోటీసు ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలో లేదా మరుసటి రోజు స్పీకర్ పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: సుప్రీంలో రాహుల్ గాంధీ పిటిషన్.. పలువురికి నోటీసులు.. బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment