న్యూఢిల్లీ: యూపీఏ పదేళ్ల పాలన(2004-2014)ను తూర్పార పడుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం లోక్‌సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైట్‌పేపర్‌ను టేబుల్ చేశారు. వైట్‌పేపర్‌లోని మొదటి 24 పేజీల్లో పదేళ్ల యూపీఏ పాలనలో జరిగిన వైఫల్యాలను, అవినీతిని వివరించారు.
అప్పట్లో వెలుగు చూసిన 2జీ, కామన్‌వెల్త్, శారదా చిట్‌ఫండ్ తదితర కుంభకోణాలను ప్రస్తావించారు.1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చింది తామేనని చెప్పే యూపీఏ నేతలు 2004లో పవర్‌లోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మరిచిపోయారని వైట్‌పేపర్‌లో కేంద్రం విమర్శించింది.
కేవలం పదేళ్లలో దేశాన్ని ‘ఫ్రాజైల్ ఫైవ్’ స్థితి నుంచి టాప్ ఫైవ్‌లోకి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపింది. కొవిడ్, పలు దేశాల మధ్య యుద్ధాలు లాంటి పరిస్థితులను కూడా అధిగమించి దేశ ప్రగతిని పరుగులు పెట్టించామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment