దేశంలో రైల్వే శాఖ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. భారతీయ రైల్వేలు 7,000 స్టేషన్లతో అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా పేరు సంపాదించింది. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే రైల్వే శాఖ ప్రయాణికులు పాటించాల్సిన కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటిని ట్రైన్‌లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్యాసింజర్ తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాల ఉల్లంఘనకు పాల్పడితే ఒక్కోసారి చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రతి ప్రయాణీకుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన 7 ప్రధాన భారతీయ రైల్వే నియమాలు ఇవే:
► టిక్కెట్ బుకింగ్: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకులందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టిక్కెట్‌ను కలిగి ఉండాలి. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో, రైల్వే స్టేషన్‌లలో లేదా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ప్రయాణించడం జరిమానాకు దారితీస్తుంది. ఈ విషయాన్ని ప్యాసింజర్లు గుర్తుపెట్టుకోవాలి.
► లగేజ్: ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తమతో లగేజ్ తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. అయితే దీనికి ఓ పరిమితి ఉంది. ఫస్ట్ ఏసీ, 2వ ఏసీకి 40 కేజీలు, 3వ ఏసీ, చైర్ కార్‌కు 35 కేజీలు, స్లీపర్ క్లాస్‌కు 15 కేజీలు లగేజీని తీసుకెళ్లేందుకు పరిమితి ఉంటుంది. ప్రయాణికులు ఏ రకమైన మండే లేదా ప్రమాదకరమైన వస్తువులను ట్రైన్‌లో తీసుకెళ్లడం నిషేధం
► ధూమపానం: రైళ్లు, ప్లాట్‌ఫారమ్‌లు, స్టేషన్ ఆవరణలో ధూమపానం నిషేధం.
► ఆహారం: ప్రయాణీకులు తమ సొంత ఆహారాన్ని తీసుకెళ్లవచ్చు లేదా ప్లాట్‌ఫారమ్‌లోని ప్యాంట్రీ కార్ లేదా ఫుడ్ స్టాల్స్ నుండి ఆహారాన్ని కొనుగోలు చేయవచ్చు.
► మద్యం: రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో మద్యం సేవించడం నిషేధం.
► టికెట్ క్యాన్సిల్, రీఫండ్: ప్యాసింజర్ వారి టిక్కెట్‌ను రద్దు చేయాలనుకుంటే, రైలు బయలుదేరే సమయానికి ముందే అలా చేయాల్సి ఉంటుంది. తద్వారా భారతీయ రైల్వే క్యాన్సిలేషన్ విధానం ప్రకారం రీఫండ్ (వాపసు) లభిస్తుంది.
► భద్రత: ప్రయాణీకులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్రయాణించేటప్పుడు ప్యాసింజర్లు వారి విలువైన వస్తువులను తీసుకెళ్లకుండా ఉండడం ఉత్తమం. ట్రైన్‌లో తోటి ప్రయాణీకులతో వాదనలు లేదా తగాదాలకు కూడా దూరంగా ఉండాలి.
చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు!
Comments
Please login to add a commentAdd a comment