న్యూజిలాండ్ వీసా రూల్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తమ దేశంలో కొన్ని పాత్రల్లో పనిచేస్తున్న విదేశీయులు తమ ద్వారా తమవారికి వర్క్, విజిటర్, స్టూడెంట్ వీసాలకు స్పాన్సర్ చేయడానికి అనుమతించని కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను న్యూజిలాండ్ ప్రకటించింది.
వీసా స్పాన్సర్లు న్యూజిలాండ్ ఆర్థిక, ఇమ్మిగ్రేషన్ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రమాణాలను చేరుకునేలా వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే ఈ నిబంధనల లక్ష్యం. వీటి ప్రకారం జూన్ 26 నుంచి ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ANZSCO) లెవల్స్ 4, 5 లో రెసిడెన్సీ పాత్‌వేస్ (వివిధ రంగాల్లో నైపుణ్యాలు) లేకుండా అక్రిడేటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా ఉన్నవారు ఇకపై తమ భాగస్వాములు, పిల్లల కోసం వర్క్, విజిట్, స్టూడెంట్ వీసా దరఖాస్తులకు మద్దతు ఇవ్వలేరు.
ఈ సంవత్సరం ప్రారంభంలో ఏఈడబ్ల్యూవీ పథకానికి చేసిన విస్తృత సవరణలకు అనుగుణంగా ఈ సర్దుబాటు ఉంటుంది. అయితే భాగస్వాములు, పిల్లలు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఎక్రిడేటర్ ఎంప్లాయర్ వర్క్ వీసా లేదా అంతర్జాతీయ స్టూడెంట్ వీసా వంటి వాటి కోసం సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భాగస్వాములుగా లేదా డిపెండెంట్ పిల్లలుగా వీసాలను కలిగి ఉన్నవారిపై ఈ మార్పుతో ప్రభావం ఉండదని న్యూజిలాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment