జాతీయ జెండావిష్కరణకు కొత్త నిబంధనలు
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రజాప్రతినిధులెవరు ఎక్కడ జెండా ఎగుర వేయాలన్న కొత్త నిబంధనలను విద్యాశాఖ విడుదల చేసినట్లు ఇన్‌చార్జి డీఈఓ అనురాధ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రజాప్రతినిధులెవరు ఎక్కడ జెండా ఎగుర వేయాలన్న కొత్త నిబంధనలను విద్యాశాఖ విడుదల చేసినట్లు ఇన్‌చార్జి డీఈఓ అనురాధ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ పాఠశాలల్లో జెడ్పీటీసీ సభ్యుడు, మండల పరిషత్/మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎంపీటీసీ సభ్యుడు, మండల పరిషత్ పాఠశాలల్లో సర్పంచ్‌లు జెండాను ఎగురవేయాలని సూచించారు. ఓ గ్రామంలో రెండు ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఒక్కదానిలో ఎంపీటీసీ సభ్యుడు, మరోదానిలో సర్పంచ్ జెండాను ఎగుర వేయాల్సి ఉందని, గ్రామంలో ఒకే పాఠశాల ఉంటే దానిలో ఎంపీటీసీ సభ్యుడు, అంగన్‌వాడీ కేంద్రంలో సర్పంచ్ జెండాను ఎగుర వేయాలని ఆమె వివరించారు. మూడు లేక నాలుగు పాఠశాలలు ఉంటే ఎంపీడీఓ సూచన మేరకు ఎవరూ ఎక్కడ జెండాను ఎగుర వేయాలనే దానిపై చర్చించుకోవాలని ఆమె సూచించారు.