ఇలా చేస్తే... మీరు రిచ్చో రిచ్చు! | If You Want To Become Rich Then Follow These 7 Rules, Check Out More Insights | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే... మీరు రిచ్చో రిచ్చు!

Published Mon, Dec 9 2024 7:13 AM | Last Updated on Mon, Dec 9 2024 9:41 AM

If you want to Become Rich then Follow These 7 Rules

జీవితంలో ఎవరికైనా సరే ధనవంతునిగా మారాలని, అన్ని సౌకర్యాలను అందిపుచ్చుకోవాలని ఉంటుంది. అయితే అందుకు పరిస్థితులు అడ్డంకిగా మారాయని పలువురు చెబుతుంటారు. సరైన పెట్టుబడి వ్యూహంతో ముందుకెళితే డబ్బుకి చింత లేకుండా జీవితాన్ని నిశ్చింతగా గడపవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

పెట్టుబడి పెట్టడంలో ఎల్లప్పుడూ తగిన వ్యూహాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం సంపాదించిన డబ్బును సరైన మార్గంలో వినియోగించినట్లవుతుంది. మనం సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని సరైన పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా హాయిగా జీవించగలుగుతాం. ఇందుకు దోహదపడేలా నిపుణులైన ఇన్వెస్టర్లు కొన్ని సూత్రాలు చెప్పారు.  

1. రూల్ ఆఫ్ 72
72 నియమం సహాయంతో స్థిర వడ్డీ రేటుతో డబ్బు ఎంత సమయంలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పెట్టుబడిపై పొందుతున్న వడ్డీ రేటును 72తో భాగించవలసి ఉంటుంది. ఉదాహరణకు, మీరు బ్యాంకులో  ఎఫ్‌డీపై 7 శాతం వడ్డీని పొందుతున్నారనుకుందాం. అప్పుడు మీరు 72ని 7తో భాగిస్తే, సమాధానం 10.28 అవుతుంది. అంటే 7 శాతం వడ్డీతో మీ డబ్బు 10.28 ఏళ్లలో రెట్టింపు అవుతుంది.

2. 10-12-10 
10-12-10 నియమం ప్రకారం 10 సంవత్సరాలకు 12శాతం వార్షిక రాబడిని ఇచ్చే పెట్టుబడి ఎంపికలో ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు దాదాపు రూ. 23-24 లక్షలను కూడబెట్టవచ్చు. అయితే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో లేదా సగటు వార్షిక రాబడి 12శాతం ఉన్న షేర్లలో ప్రతి నెలా రూ. 43,000 పెట్టుబడి పెడితే, మీరు 10 సంవత్సరాలలో రూ. ఒక కోటి కార్పస్‌ను సృష్టించగలుగుతారు.

3. 20-10-12 
20-10-12 నియమం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం. మీరు 12శాతం వార్షిక రాబడిని ఇచ్చే పెట్టుబడి ఎంపికలో 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే, మీరు కోటి రూపాయల కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు.

4. 50-30-20
50-30-20 నియమం అనేది మీ ఆదాయాన్ని వివిధ ఆర్థిక లక్ష్యాలకు కేటాయించడంలో మీకు సహాయపడే వ్యక్తిగత ఆర్థిక సూత్రం. ఈ నియమం ప్రకారం మీరు మీ ఆదాయంలో 50 శాతం అవసరమైన ఖర్చుల కోసం, 30 శాతం వినోదం, భోజనం వంటి ఖర్చులకు 20 శాతం పొదుపు,పెట్టుబడుల కోసం కేటాయించాలి.

5. 40-40-12 
మీరు 10-20 సంవత్సరాలలో పెద్ద కార్పస్‌ను  అందుకునేందుకు 40-40-12 నియమాన్ని అనుసరించాల్సివుంటుంది. ఇందులో మీరు  అధికమొత్తంలో పొదుపు చేయాలి. ఈ నియమంలో మీరు మీ నెలవారీ ఆదాయంలో 40 శాతం మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లలో మీ పోర్ట్‌ఫోలియోలో 40 శాతం ఉంచాల్సి ఉంటుంది. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా సగటు వార్షిక రాబడిని 12 శాతం లక్ష్యంగా చేసుకోవాలి.

6. 15-15-15 
15-15-15 నియమం ప్రకారం మీరు సంవత్సరానికి సగటున 15శాతం రాబడిని పొందే పెట్టుబడి ఎంపికలో 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 15,000 పెట్టుబడి పెడితే, మీరు సుమారు కోటి రూపాయలు అందుకో గలుగుతారు.

7. 25X 
ఈ నియమం త్వరగా పదవీ విరమణ పొందాలనుకునే వారి కోసం ఉద్దేశించినది. ఈ నియమం ప్రకారం మీరు హాయిగా పదవీ విరమణ చేయగలిగేలా మీ వార్షిక ఖర్చుల కోసం ముందుగానే 25 రెట్లు ఆదా చేయాలి. ఉదాహరణకు మీ జీవనానికి సంవత్సరానికి రూ. 4 లక్షలు అవసరమైతే, మీ పదవీ విరమణ నిధికి రూ. ఒ‍క కోటి (రూ. 4 లక్షలు x 25) అవసరం. సిప్‌ తరహా పెట్టుబడి ఎంపికలను అవలంబించడం ద్వారా మీరు ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం అవుతుందని గుర్తించండి. 

ఇది కూడా చదవండి: 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్‌ ఇసాక్‌మన్‌ సక్సెస్‌ స్టోరీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement