
సాక్షి, చెన్నై: కోర్టు విధించిన నిబంధనను ఐదేళ్లుగా ఇద్దరు నిందితులు తూచా తప్పకుండా అనుసరిస్తుండడం వెలుగుచూసింది. వీరి పరిస్థితిని చూసిన ఓ సామాజిక కార్యకర్తలు ఆ నిబంధనల్ని ఎత్తివేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సేలం జగత్తు వనపట్టిలో 2015లో ఆక్రమణల తొలగింపు వివాదానికి దారి తీశాయి. రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్నట్టు, వాహనాలపై దాడులు చేసినట్టు మణి, పళని అనే ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలతో కూడిన బెయిల్‌పై అదే ఏడాది మేలో బయటకు వీరు వచ్చాయి.
కోర్టు విధించిన నిబంధనను ఇద్దరు ఐదేళ్లుగా అనుసరిస్తున్నారు. ఇందులో నుంచి విముక్తి కోసం ఆ ఇద్దరు కోర్టును ఆశ్రయించలేదు. పోలీసులు కేసును ముందుకు తీసుకెళ్ల లేదు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లుగా కోర్టు నిబంధనను అనుసరి స్తూ ఆ ఇద్దరు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కి వస్తుండడాన్ని విజయేంద్రన్ అనే వ్యక్తి గుర్తించారు. వారికి విముక్తి కల్పించడం కోసం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ హైకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఆ ఇద్దరు కోర్టు నిబంధనల్ని అనుసరిస్తూ వస్తుండడం చూసి న్యాయమూర్తి షాక్‌కు గురయ్యారు. తక్షణం ఇద్దరికి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment