signatures
-
జైల్లోంచి పనిచేయకుండా కేజ్రీవాల్‌పై నిషేధం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ: జైలులో నుంచి విధులు నిర్వర్తించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిషేధమేమైనా ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడంలో జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు అవరోధాలేమిటని నిలదీసింది. ముందస్తు విడుదలకు సంబంధించి ఫైళ్లపై నిర్ణయాలు ఆలస్యం కావడం సరికాదని అభిప్రాయపడింది. ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన కేసును శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణంగా ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను చేరాలంటే తొలుత ముఖ్యమంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సదరు ఫైలుపై సంతకం చేయడం ఆలస్యం కావడాన్ని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ‘‘జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ ముందస్తు విడుదల ఫైళ్లపై సంతకం చేయకూడదని ఏమైనా నిబంధన ఉందా? స్వయంగా ఓ కేసులో విచారణ ఖైదీగా ఉన్న సీఎం సదరు ఫైలుపై సంతకం చేయకుండా నిషేధం ఏమైనా ఉందా?’’అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి, సీనియర్ న్యాయవాది అర్చనా దవేలు కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదని వివరించారు. ఒకవేళ అలాంటి నిబంధన ఏమైనా ఉంటే చెప్పాలని లేదంటే ఆరి్టకల్ 142 ఇచి్చన అధికారాలతో కోర్టు పరిశీలన చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం వేచి ఉండరాదని అభిప్రాయపడుతూ ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణం ద్వారా అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన మాజీ సీఎం చంద్రబాబు నిర్వాకాలు సంతకాలు సాక్షిగా బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లూ ఆయనకు ఏమీ తెలియదంటూ బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వాదనలో ఏమాత్రం నిజం లేదని నోట్‌ఫైళ్ల సాక్షిగా తేటతెల్లమైంది. మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని, గుట్టు చప్పుడు కాకుండా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని నిరూపించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నాడు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, కేబినెట్‌కు తెలియకుండా అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు చంద్రబాబు ప్రయోజనం కల్పించారు. 2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8 శాతం ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీ, బార్లపై ఉన్న 9 శాతం ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీని తొలగిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ఖజానాకు రూ.1,299.64 కోట్ల మేర గండి కొట్టారు. ఈమేరకు సంబంధిత నోట్ ఫైళ్లపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేసినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఖజానాకు తూట్లు పొడిచి సన్నిహితులు, బినామీలకు చెందిన కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సాగించిన మద్యం కుంభకోణం ఇలా సాగింది!! ఆర్థిక శాఖ అనుమతి లేదు... కేబినెట్ ఆమోదం లేదు అధికారంలో ఉండగా మద్యం విధానం ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడింది. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించింది. కనీసం ఆర్థిక శాఖ అనుమతిగానీ కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే కథ నడిపించింది. రెండు జీవోలకు కేబినెట్ తీర్మానం చేసి ప్రివిలేజ్ ఫీజు తొలగించే కీలకమైన జీవోను మాత్రం అడ్డదారిలో తేవడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్‌ను ప్రభుత్వానికి పంపారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని అందులో ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ దృష్టికే తీసుకెళ్లలేదు. నూతన మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేయగా ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు (ఏ 4 షాపులు) ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. అయితే అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి ఓ నోట్ పంపారు. మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని అందులో సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈమేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్‌ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసని తేలిపోతోంది. సాయంత్రం గుట్టుగా జీవో చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ అదే రోజు అంటే 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. ఈ జీవో గురించి కేబినెట్లో చర్చించలేదు. అజెండాలో ఆ అంశమే చేర్చలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియచేయలేదు. అనుమతి తీసుకోలేదు. అంటే కేబినెట్‌కు తెలియకుండా, కనీసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కథ నడిపించాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. బార్లలోనూ అదే బరితెగింపు... మద్యం దుకాణాలపై అడ్డగోలుగా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిన చంద్రబాబు అంతటితో ఆగలేదు. తన సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అదే రీతిలో లబ్ధి చేకూర్చారు. ఈమేరకు చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని, అందుకోసం ఎకైŠస్జ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న ఓ సర్కుల్యర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కనికట్టు చేశారు. 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు ఈమేరకు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపడం గమనార్హం. సెప్టెంబరు 9న వినతి పత్రం సమర్పిస్తే దానికి వారం రోజులు ముందుగానే సెప్టెంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యూలర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయించారు. బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. నాటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపారు. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం గమనార్హం. ఇన్నాళ్లూ అసలు ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయం చంద్రబాబుకు కనీసం తెలియదని టీడీపీ న్యాయవాదులు, ఈనాడు రామోజీరావు బుకాయించారు. తీవ్రంగా తప్పుబట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ టీడీపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడాన్ని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఈమేరకు తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. -
‘నోట్’ దిస్ పాయింట్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కోసం చంద్రబాబు చేత చంద్రబాబు కొరకు.. ఇదీ టీడీపీ ప్రభుత్వంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం. తనకేం సంబంధం లేదని చంద్రబాబు ఎంతగా బుకాయించినా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లు ఆయన బండారాన్నిబట్టబయలు చేస్తున్నాయి. కేవలం నిధులు కొల్లగొట్టేందుకే చంద్రబాబు ఆద్యంతం తానై వ్యవహరించారన్నది ఆధారాలతోసహా వెల్లడైంది. కేబినెట్ ఆమోదం లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం నుంచి జీవోకు విరుద్ధంగా ఒప్పందం.. ఒప్పందానికి విరుద్ధంగా నిధులు అక్రమంగా విడుదల చేసే వరకు ఆయనే సర్వంతానై వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని స్వయంగా ఆదేశించారు. కుంభకోణానికి మార్గం సుగమం చేస్తూ.. నిధులు కొల్లగొట్టేందుకు నోట్ ఫైళ్లలో 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేయగా, ఏ–2గా ఉన్న అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఐదు చోట్ల సంతకాలు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్–ట్రైనింగ్, సాధారణ పరిపాలన శాఖకు చెందిన మొత్తం 13 నోట్ ఫైళ్లలో చంద్రబాబు చేసిన సంతకాలు ఆయన ప్రత్యక్ష ప్రమేయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. -
గుడ్‌న్యూస్! ఒక్కో బొగ్గు గని కార్మికుడికి లక్షన్నర నుంచి రూ.5 లక్షలు..
గోదావరి ఖని: దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు శనివారం ఖరారైంది. 23నెలల ఆలస్యంగా జరిగిన లిఖితపూర్వక వేతన ఒప్పందంపై కోలిండియా యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కోల్‌కత్తాలో రెండు రోజుల పాటు జరిగిన 11వ వేజ్‌బోర్డు 10వ సమావేశంలో కనీస వేతనాలపై 19శాతం పెరుగుదల, అలవెన్స్‌లపై 25శాతం పెరుగుదలతో ఒప్పందం పూర్తయ్యింది. పెరిగిన వేతనాలు జూన్ నుంచి అమల్లోకి రానుండగా, జూలై నుంచి కార్మికులు అందుకోనున్నారు. పెరిగిన 19శాతం కనీస వేతనం బకాయిల మేరకు ఒక్కో కారి్మకునికి రూ.1.50లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఎరియర్స్ రూపంలో 23నెలల బకాయిలు అందనున్నాయి. ద్విచక్రవాహనాలకు పెట్రోల్ అలవెన్స్ చెల్లిస్తున్నట్టుగానే, ఈసారి కార్లకు కూడా చెల్లించేందుకు అంగీకరించింది. ట్రాన్స్‌పోర్టు, అడిషనల్ ట్రాన్స్‌పోర్టు, వాషింగ్ అలవెన్స్‌తో పాటు పలు అలవెన్స్‌లపై 25శాతం పెరిగింది. ఈ ఒప్పందంతో దేశవ్యాప్తంగా 4లక్షల మందికి ప్రయోజనం చేకూరనుండగా, వీరిలో సింగరేణి కారి్మకులు 39వేల మంది ఉన్నారు. సమావేశంలో కోలిండియా చైర్మెన్ ప్రమోద్ అగర్వాల్‌తో పాటు సింగరేణి డైరెక్టర్(పా) బలరాం, పర్సనల్ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్‌ప్రసాద్(ఐఎన్టీయూసీ), రియాజ్ అహ్మద్(హెచ్ఎంఎస్), మంద నర్సింహారావు(సీఐటీయూ), మాధవనాయక్(బీఎంఎస్) పాల్గొన్నారు. -
వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్
ముంబై: సంతకాలను అచ్చుగుద్దినట్టుగా కాపీ చేసే కేటుగాళ్లను చూశాం. ఫోర్జరీ సంతకాలతో అవతలి వాళ్లకే కాదు, ఆ సంతకంగల వారికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా అనేక లావాదేవీలతో భారీ మోసాలకు పాల్పడే నేరగాళ్లు మన చుట్టూ చాలామందే అన్నారు. తాజాగా సిగ్నేచర్లను కాపీ చేస్తున్న మెషీన్ ఒకటి ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్‌వర్మ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. సంతకాల రోజులు పోయాయి ..ఈ మెషీన్ సంతకాన్ని ఖచ్చితంగా కాపీ చేయగలదు అంటూ ట్వీట్ చేశారు. పెన్ను పట్టుకుని అక్కుడున్న సంతకాన్ని అచ్చంగా దించేస్తున్న వైనంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అయితే ఈ మెషీన్‌లోని టెక్నాలజీ ఏంటి, ఏ కంపెనీ మెషీన్ అనే దానిపై క్లారిటీ లేదు. ఇది చాలా ప్రమాదకరమని కొందరు, నిశానీ (వేలిముద్రల) రోజులే బావున్నాయని కొందరు, ఓటీపీ ఉందిగా అంటూ మరికొందరు కమెంట్ చేశారు. కానీ సాధారణంగా సంతకంలోని స్ట్రోక్ ఒక సంతకానికి మరో సంతకానికి భిన్నంగా ఉంటుంది, కాబట్టి సంతకాన్ని మాత్రమే యంత్రం కాపీ చేయగలదు కానీ, స్ట్రోక్‌ను కాపీ చేయలేదని ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే మరో యూజర్ దమ్ముంటే దీన్ని కాపీ చేయండి అంటూ సినీనటుడు, బాలకృష్ట సంతకాన్ని షేర్ చేయడం నవ్వులు పూయిస్తోంది. GONE are the days of signatures ..This machine can copy a signature exactly pic.twitter.com/mNQI0v8fbc — Ram Gopal Varma (@RGVzoomin) October 22, 2022 Try copy this pic.twitter.com/vAwoT5jVsq — Mr.an's (@anildicon) October 22, 2022 But a machine can copy a signature but generally the stroke in a signature is different from one signature to another signature, the machine can follow only one signature but can’t copy the stroke of the signature who is signing, machines can’t — CA MSR (@MUNAGAS) October 22, 2022 -
అన్నిటికీ తహ‘సీల్’దారే !
ములకలచెరువు: ములకలచెరువు తహసీల్దార్ పనితీరు వివాదాస్పదమవుతోంది. వీఆర్ఓలు, ఆర్ఐతో సంబంధం లేకుండా వెబ్‌ల్యాండ్‌లో భూముల ఆన్లైన్ ప్రక్రియ కానిస్తున్నారు. భూములకు సంబంధించి విచారణ నివేదికలు, ఫైళ్లలో సంతకాలు లేకున్నా..ఆయనే నేరుగా అన్ని పనులను చక్కబెట్టేస్తున్నారు. ఫలితంగా అధికారులు, ఉద్యోగుల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. జరగాల్సింది ఇలా.. రైతులు భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటారు. వీఆర్ఓ, ఆర్ఐ క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తులోని భూములు వివాదాస్పదమైనవా, ఇంతకుమునుపు ఈ భూములు ఎవరి పేరు మీదైనా ఉన్నా యా, భాగపరిష్కారాలు అయ్యాయా లేదా.. అనే విచారణలు చేయాలి. వీఆర్ఓ క్షేత్రస్థాయిలో వన్‌బీలో రైతు భూమి వివరాలు పరిశీలించి నివేదిక తయారు చేస్తే ఆర్ఐ మరోసారి పరిశీలించి నిర్ధారించి సంతకం చేస్తారు. నివేదికను తహసీల్దార్‌కు పంపాక ఆయన సంతకం చేస్తే వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలను ఆన్లైన్ చేస్తారు. చేస్తున్నది ఇలా.. వీఆర్ఓ, ఆర్ఐ సంతకాలు లేకుండా తహసీల్దార్ వెబ్‌ల్యాండ్ దరఖాస్తులపై సంతకాలు చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియ పూర్తవుతోంది. తహసీల్దార్‌కు అనుకూలంగా కొందరు వీఆర్ఓలు సహకరిస్తున్నారు. ఉద్యోగుల్లో ఆందోళన వీఆర్ఓలు, ఆర్ఐతో సంబంధం లేకుండా తహసీల్దార్ డైరెక్ట్‌గా వెబ్‌ల్యాండ్‌లో భూముల ఆన్లైన్ ప్రక్రియ కానిస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ముగ్గురు వీఆర్ఓలతో కలిసి తహసీల్దార్ ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారని.. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని భీతిల్లుతున్నారు. ఈ–పాస్ పుస్తకాలను తహసీల్దార్ చాంబర్‌లోని బీరువాలో పెట్టుకుని రైతులకు ఫోను ద్వారా సమాచారం అందించి పుస్తకాలను చేరవేస్తున్నట్లు సమాచారం. వెలుగు చూసిన దరఖాస్తులివీ ♦పెద్దపాళెం పంచాయతీకి చెందిన సి.నారాయణ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఆన్లైన్ కోసం 451 ఖాతా నంబరు ద్వారా జూలై 7వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. 104ఏ, 106/4ఏ, 107బి, 108/1, 116ఏ, 118ఏ, 140/2, 142–4డి, 175–5, 207/2, 89ఏ, 95 సర్వే నంబర్లలో మొత్తం విస్తీర్ణం 2.3250 ఎకరాల భూమి ఉంది. ♦సోంపల్లె పంచాయతీకి చెందిన చిన్న కోటప్ప వెబ్‌ల్యాండ్‌లో భూమి ఆన్లైన్ చేసుకోవడానికి 122 ఖాతా నంబరు ద్వారా జూన్ 18వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. 1215/7, 1215–3డి, 1284–9ఏ, 291/2బి/1, 291/2బి/1, 618–1ఏ2 సర్వే నంబర్లలో మొత్తం విస్తీర్ణం 31.7500 ఎకరాల భూమి ఉంది. ♦దేవులచెరువుకు చెందిన వెంకటరమణారెడ్డి వైబ్‌ల్యాండ్‌లో భూమి ఆన్లైన్ కోసం 859 ఖాతా నంబరు ద్వారా జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 757/5, 823, 826, 755/1 సర్వే నంబర్లలో అతని భూమి ఉంది. ♦నాయనచెరువుపల్లెకు చెందిన కే. రమణమ్మ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఆన్లైన్ చేసుకోవడానికి ఖాతా నంబరు 27 ద్వారా జూలై 2వ తేదీ దరఖాస్తు చేసుకుంది. 34–బి, 57/డి, 59 వై, 168/1, 170–ఈ, 14 ఎన్, 25 పి, 167–3హెచ్, 140ఎన్, 10–26ఏ సర్వే నంబర్లలో భూములు ఉన్నాయి. ♦దేవులచెరువుకు చెందిన ఎం. నాగమ్మ 1180/2 సర్వే నంబరు ద్వారా 2.07 ఎకరాల విస్తీర్ణం ఆన్లైన్ కోసం జూలైలో దరఖాస్తు చేసుకుంది. ♦మొత్తం రైతుల వైబ్ల్యాండ్ దరఖాస్తుల్లో వీఆర్ఓ, ఆర్ఐ సంతకాలు లేవు. తహసీల్దార్ సంతకం మాత్రమే ఉంది. ఆ అధికారం నాకు ఉంది వెబ్‌ల్యాండ్‌లో డైరెక్ట్‌గా ఆన్లైన్ చేసే అధికారం తహసీల్దార్‌గా నాకు ఉంది. వీఆర్ ఓలు, ఆర్‌ఐకు తెలియకుండా భూములు, స్థలాలను ఇప్పటిదాకా ఆన్లైన్ చేయలేదు. – తహసీల్దార్ మహేశ్వరీబాయి అలా చేయడం తప్పు భూములు ఆన్లైన్లో నమోదు చేయాలంటే వీఆర్ఓ, ఆర్ఐ విచారణ నివేదికలు అవసరం. అవి లేకుండా తహసీల్దార్ నేరుగా నమోదుచేయడం జరగదు. అలా జరిగివుంటే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. –మార్కండేయులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు -
ఐదేళ్లుగా సంతకం.. న్యాయమూర్తి షాక్
సాక్షి, చెన్నై: కోర్టు విధించిన నిబంధనను ఐదేళ్లుగా ఇద్దరు నిందితులు తూచా తప్పకుండా అనుసరిస్తుండడం వెలుగుచూసింది. వీరి పరిస్థితిని చూసిన ఓ సామాజిక కార్యకర్తలు ఆ నిబంధనల్ని ఎత్తివేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సేలం జగత్తు వనపట్టిలో 2015లో ఆక్రమణల తొలగింపు వివాదానికి దారి తీశాయి. రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్నట్టు, వాహనాలపై దాడులు చేసినట్టు మణి, పళని అనే ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలతో కూడిన బెయిల్‌పై అదే ఏడాది మేలో బయటకు వీరు వచ్చాయి. కోర్టు విధించిన నిబంధనను ఇద్దరు ఐదేళ్లుగా అనుసరిస్తున్నారు. ఇందులో నుంచి విముక్తి కోసం ఆ ఇద్దరు కోర్టును ఆశ్రయించలేదు. పోలీసులు కేసును ముందుకు తీసుకెళ్ల లేదు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లుగా కోర్టు నిబంధనను అనుసరి స్తూ ఆ ఇద్దరు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కి వస్తుండడాన్ని విజయేంద్రన్ అనే వ్యక్తి గుర్తించారు. వారికి విముక్తి కల్పించడం కోసం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ హైకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఆ ఇద్దరు కోర్టు నిబంధనల్ని అనుసరిస్తూ వస్తుండడం చూసి న్యాయమూర్తి షాక్‌కు గురయ్యారు. తక్షణం ఇద్దరికి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
సెన్సెక్స్ 41,700–41,810 శ్రేణిని అధిగమిస్తేనే...
అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై జనవరి 15న సంతకాలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, చైనా కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున 115 బిలియన్ డాలర్ల నిధుల్ని వ్యవస్థలోకి విడుదల చేయడం వంటి పాజిటివ్ వార్తల నేపథ్యంలో పలు ప్రపంచ దేశాల సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పినా, భారత్ స్టాక్ సూచీలు...కొత్త గరిష్టస్థాయిల్ని నమోదు చేయలేకపోయాయి. ఈ లోపున అమెరికా డ్రోన్ దాడులతో మధ్యప్రాచ్యంలో సృష్టించిన సంక్షోభ ఫలితంగా కొత్త ఏడాది తొలివారంలో మన మార్కెట్ నష్టాలతో ముగిసింది. మధ్యప్రాచ్య సంక్షోభ ప్రభావంతో క్రూడ్, బంగారం ధర అమాంతం పెరిగాయి. దీంతో మన వాణిజ్యలోటు పెరగడం, రూపాయి క్షీణించడం వంటి ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. పరిస్థితి తీవ్రతరమైతే ఆ దేశాల నుంచి భారతీయులు పంపించే రెమిటెన్సులు తగ్గడం కూడా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ రిస్క్‌లను స్టాక్ మార్కెట్ ఎంతవరకు తట్టుకుంటుందో..ఇప్పుడే అంచనా వేయలేము. ఇక స్టాక్ సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 3తో ముగిసిన ఈ ఏడాది తొలివారంలో పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 110 పాయింట్ల స్వల్పనష్టంతో 41,465 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొద్దిరోజులుగా 41,700–41,800 శ్రేణి మధ్య పలు దఫాలు అవరోధాన్ని ఎదుర్కొంటున్నందున, ఈ శ్రేణిని ఛేదించి, ముగిసేంతవరకూ కన్సాలిడేషన్ ప్రక్రియ కొనసాగవచ్చు. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే తొలుత 41,260 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 41,130 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 41,000–40,730 పాయింట్ల శ్రేణి మధ్యలో మద్దతు పొందవచ్చు. ఇక మార్కెట్ పెరిగితే 41,700–41,810 ్రÔó ణి వద్ద మరోదఫా గట్టి అవరోధాన్ని చవిచూడవచ్చు. ఈ శ్రేణిని దాటితే వేగంగా 41,980 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 42,200 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 12,150... గత కాలమ్‌లో ప్రస్తావించిన రీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ క్రితం వారం మరో రెండు దఫాలు 12,290 సమీపంలో గట్టి అవరోధాన్ని చవిచూసి ముందడుగు వేయలేకపోయింది. అంతక్రితం వారంతో పోలిస్తే 19 పాయింట్ల స్వల్పనష్టాన్ని చవిచూసింది. గత 10 ట్రేడింగ్ సెషన్లలో దాదాపు ఐదు దఫాలు 12,290 పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీకి అవరోధం కలిగింది. రానున్న రోజుల్లో ఈ స్థాయిని దాటేంతవరకూ కన్సాలిడేషన్ లేదా కరెక్షన్ బాటలో నిఫ్టీ కదులుతుంది. ఈ వారం నిఫ్టీ తగ్గితే 12,150 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వెనువెంటనే 12,115 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 12,070–11,980 పాయింట్ల శ్రేణి వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే, మరోదఫా 12,290 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని దాటితే 12,360 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 12,425 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
ఫీ‘జులుం’పై చర్యలేవీ..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్య వ్యాపారీ కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణను ప్రారంభించింది. సోమవారం దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ క్యాంపెయిన్ ను మాజీ మంత్రి, మండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తొలి సంతకం చేసి ప్రారంభించారు. టీపీసీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షబ్బీర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పాఠశాల విద్య భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అత్యంత ఖరీదైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కాంగ్రెస్ ప్రభుత్వం 2009 ఆగస్టులో అమల్లోకి తెచ్చిన ఉత్తర్వులను టీఆర్ఎస్ తుంగలో తొక్కింద న్నారు. సీఎం కేసీఆర్ విద్యావ్యాపారంపై ఎప్పుడూ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని, దాదాపు 52 శాతం మంది పిల్లలు చదువుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలకు ముకుతాడు వేయడం గురించి ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. టీపీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ అబ్దుల్లా సోహైల్ మాట్లాడుతూ.. రానున్న 2 నెలల్లో 10 లక్షల సంతకాలను సేకరించి గవర్నర్‌కు ఇస్తా మని చెప్పారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొలి సంతకం చేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ -
దస్తావేజుల్లో సంతకాలపై ఆరోపణలు వస్తే..
సాక్షి, హైదరాబాద్: దస్తావేజుల్లో సంతకాలు అసలైనవో, ఫోర్జరీ చేసినవో తేలాలంటే సంబంధిత రికార్డులను పరిశీలించడమే కాకుండా, నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కింది కోర్టులకు హైకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ ఏదశలో ఉన్నా నిపుణుడి అభిప్రాయం కోసం ఆదేశాలు జారీ చేయవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఆదేశాలిచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలోని 6.32 ఎకరాలకు (సర్వే నం 144/ఎఎ) సంబంధించిన యాజమాన్య హక్కుపై 2010లో లక్కినేని రమేశ్‌పై లక్కినేని సూర్యనారాయణ ఖమ్మం జిల్లా కోర్టులో దావా వేశారు. ‘నా సంతకాన్ని రమేశ్ ఫోర్జరీ చేసి భూ విక్రయ దస్తావేజును సృష్టించారు. అధికారిక ఉత్తర్వులు లేకపోయినా రెవెన్యూ అడంగల్‌లో రమేశ్ పేరు చేర్చారు. రమేశ్ చూపించే పహాణీ పత్రాలు సరైనవి కావు. ఎమ్మార్వో నుంచి పహాణీ, అడంగల్స్ తెప్పించి ఏది అసలైందో తేల్చాలి. రిజిస్ట్రేషన్ పత్రాల్లో తన పేరిట ఉన్న సంతకంపై నిపుణుల అభిప్రాయాన్ని కోరాలి’ అని సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను ఖమ్మం కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఖమ్మం జిల్లా కోర్టు ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు. -
బాండ్ రాసిస్తేనే బడిలోకి..
ఖమ్మం మయూరి సెంటర్: సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిన ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఒకరోజు ఆలస్యంగా వచ్చారని ఖమ్మం జిల్లాలో బాండ్ పేపర్లపై సంతకాలు చేయించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ నెల 16 వరకు ఎస్సీ గురుకులాలకు సంక్రాంతి సెలవులు ఇవ్వగా, ఒకరోజు ఆలస్యంగా 18న (గురువారం) విద్యార్థులు తిరిగి వచ్చారు. మరోసారి ఇలా ఆలస్యం జరగనీయమని రూ. 20 స్టాంప్ పేపర్‌పై వివరణ రాసి, తల్లిదండ్రుల చేత సంతకాలు చేసి సమర్పించాలని హుకుం జారీ చేశారు. ఖమ్మం ఆర్సీవో పుల్లయ్య నుంచి అనుమతి తీసుకురావాలని వెనక్కి పంపించడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఎస్సీ గురుకులాల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆర్సీవో కూడా అందుబాటులో లేకపోవడంతో.. ఆందోళన చేశారు. పీడీఎస్‌యూ నాయకులు మద్దతుగా నిలిచారు. దీంతో అధికారులు స్పందించి.. ఎలాంటి బాండ్లు లేకుండానే రెసిడెన్షియల్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. -
ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనకు ముస్లింల మద్దతు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఏవిధంగా విజయం సాధించిందని మత పెద్దలతో పాటు ప్రత్యర్థులు బుర్రలకు పదునుగా పెడుతుండగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీని వెనుకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనకు భారీ సంఖ్యలో ముస్లింలు మద్దతు తెలిపారు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) చేపట్టిన సంతకాల కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎంఆర్ఎం పిటిషన్ పై 10 లక్షల మందిపైగా ముస్లింలు సంతకాలు చేశారు. వీరిలో అత్యధికులు మహిళలు కావడం గమనార్హం. ట్రిపుల్ తలాక్ అంశంపై దేశవ్యాప్త చర్చ జరగాలని ఎంఆర్ఎం పిలుపునిచ్చింది. ‘ఇది ఒక కమ్యునిటీలో ఎదురైన సమస్య. దీనిపై సమగ్రంగా చర్చించి పరిష్కారం కనుగొనాలి. ట్రిపుల్ తలాక్ అంశంతో సంబంధమున్నవారు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వం కలిసి దీనిపై చర్చించాలి. ముస్లిం మహిళలకు అన్యాయం జరగకుండా చూడాల’ని ఎంఆర్ఎం పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయానికి ట్రిపుల్ తలాక్ అంశం దోహదం చేసిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. -
నీటిమీటర్లపై వైఎస్సార్సీపీ సంతకాల సేకరణ
గాంధీనగర్: విజయవాడ నగరంలో నీటి మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక లెనిన్ సెంటర్లో నీటిమీటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రజల నుంచి సంతకాలను సేకరిస్తున్నారు. నీటి మీటర్లు పెట్టి, వినియోగానికి అనుగుణంగా ఛార్జీలు వసూలు చేయాలని మంత్రి నారాయణ ఇటీవల ఓ ప్రకటన చేసిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అత్యవసరంగా కార్పొరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీటి మీటర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీలతోపాటు కార్పొరేటర్లు భవకుమార్, దామోదర్, నాయకులు పాల్గొన్నారు. -
ఆర్బీఐ, ఈసీబీల మధ్య మరింత సహకారం
ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)లు ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంకుల స్థాయిల్లో వివిధ ఆర్థిక, సాంకేతిక, విజ్ఞానపరమైన అంశాలకు సంబంధించి మరింత సహకారం, సమన్వయం ఈ అవగాహన లక్ష్యం. అవగాహనా పత్రంపై సోమవారం ఆర్బీఐ చీఫ్ రఘురామ్ రాజన్, ఈసీబీ ప్రెసిడెంట్ మారియో సంతకాలు చేశారు.