ముంబై: సంతకాలను అచ్చుగుద్దినట్టుగా కాపీ చేసే కేటుగాళ్లను చూశాం. ఫోర్జరీ సంతకాలతో అవతలి వాళ్లకే కాదు, ఆ సంతకంగల వారికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా అనేక లావాదేవీలతో భారీ మోసాలకు పాల్పడే నేరగాళ్లు మన చుట్టూ చాలామందే అన్నారు. తాజాగా సిగ్నేచర్‌లను కాపీ చేస్తున్న మెషీన్ ఒకటి ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతోంది.
వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్‌వర్మ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. సంతకాల రోజులు పోయాయి ..ఈ మెషీన్ సంతకాన్ని ఖచ్చితంగా కాపీ చేయగలదు అంటూ ట్వీట్ చేశారు. పెన్ను పట్టుకుని అక్కుడున్న సంతకాన్ని అచ్చంగా దించేస్తున్న వైనంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అయితే ఈ మెషీన్‌లోని టెక్నాలజీ ఏంటి, ఏ కంపెనీ మెషీన్ అనే దానిపై క్లారిటీ లేదు.
ఇది చాలా ప్రమాదకరమని కొందరు, నిశానీ (వేలిముద్రల) రోజులే బావున్నాయని కొందరు, ఓటీపీ ఉందిగా అంటూ మరికొందరు కమెంట్ చేశారు. కానీ సాధారణంగా సంతకంలోని స్ట్రోక్ ఒక సంతకానికి మరో సంతకానికి భిన్నంగా ఉంటుంది, కాబట్టి సంతకాన్ని మాత్రమే యంత్రం కాపీ చేయగలదు కానీ, స్ట్రోక్‌ను కాపీ చేయలేదని ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే మరో యూజర్ దమ్ముంటే దీన్ని కాపీ చేయండి అంటూ సినీనటుడు, బాలకృష్ట సంతకాన్ని షేర్ చేయడం నవ్వులు పూయిస్తోంది.
GONE are the days of signatures ..This machine can copy a signature exactly pic.twitter.com/mNQI0v8fbc
— Ram Gopal Varma (@RGVzoomin) October 22, 2022
Try copy this pic.twitter.com/vAwoT5jVsq
— Mr.an's (@anildicon) October 22, 2022
But a machine can copy a signature but generally the stroke in a signature is different from one signature to another signature, the machine can follow only one signature but can’t copy the stroke of the signature who is signing, machines can’t
— CA MSR (@MUNAGAS) October 22, 2022
Comments
Please login to add a commentAdd a comment