బాలయ్య, బిగ్ బిని కలిసింది అందుకేనా..! | amithab bacchan guest role in bala krishna film | Sakshi
Sakshi News home page

బాలయ్య, బిగ్ బిని కలిసింది అందుకేనా..!

Published Thu, Oct 20 2016 8:41 AM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

బాలయ్య, బిగ్ బిని కలిసింది అందుకేనా..! - Sakshi

బాలయ్య, బిగ్ బిని కలిసింది అందుకేనా..!

ప్రస్తుతం సర్కార్ 3 షూటింగ్లో బిజీగా ఉన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ను నందమూరి బాలకృష్ణ కలిసారు. సర్కార్ లోకేషన్ కు వెళ్లినబాలయ్య కాసేపు అమితాబ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలతో ముచ్చటించారు. బాలయ్యతో పాటు దర్శకుడు కృష్ణవంశీ కూడా ఉండటంతో ఈ భేటిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తన 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమా తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో అమితాబ్తో అతిథి పాత్ర చేయించాలని భావిస్తున్నారట. అందుకే బాలకృష్ణ, కృష్ణవంశీతో కలిసి వెళ్లి స్వయంగా తన సినిమాలో నటించాలంటూ కొరారన్న టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో రామ్ గోపాల్ వర్మను కూడా బాలయ్య కలవటంతో.., వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు వార్తలపై అధికారిక సమాచారం లేకపోయినా.. మీడియా సర్కిల్స్లో  ఇదే చర్చ జరుగుతోంది. మరి త్వరలో బాలయ్య, బిగ్ బి, వర్మల కాంబినేషన్పై ప్రకటన వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement