వర్మ యాక్టింగ్‌ డెబ్యూ పై బిగ్‌బీ కామెంట్‌ | Amitabh Bachchan Reaction on RGV Acting Debut | Sakshi
Sakshi News home page

వర్మ యాక్టింగ్‌ డెబ్యూ పై బిగ్‌బీ కామెంట్‌

Published Mon, Apr 8 2019 11:15 AM | Last Updated on Mon, Apr 8 2019 11:17 AM

Amitabh Bachchan Reaction on RGV Acting Debut - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ నటుడిగా మారుతున్న సంగతి తెలసిందే. ఇప్పటికే దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, గాయకుడిగా తనలోని వివిధ కోణాలను చూపించిన వర్మ త్వరలో కోబ్రా సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఆదివారం వర్మ పుట్టిన రోజు  సందర్భంగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

వర్మ యాక్టింగ్‌ డెబ్యూపై బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ ఆసక్తికరం స్పందించారు. ‘రామ్‌ గోపాల్ వర్మ ద సర్కార్‌ చివరకు తన అసలైన వృత్తిని ఎంచుకున్నాడు. నటుడిగా మారుతున్న మీకు ఆల్‌ ద బెస్ట్ సర్కార్‌.. డామ్‌.. నాకు మరొకరు పోటి’ అంటూ అమితాబ్‌ ట్వీట్ చేశారు.

ఆర్జీవీ గన్‌షాట్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న కోబ్రా సినిమాను రామ్‌ గోపాల్‌ వర్మ అగస్త్య మంజులు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో వర్మ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌ ఆర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమాలో వర్మ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ రిలీజ్ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement