‘బర్త్ డే అంటే నాకు చాలా చిరాకు’ | Ram Gopal Varma Cobra First Look Launch | Sakshi
Sakshi News home page

‘బర్త్ డే అంటే నాకు చాలా చిరాకు’

Published Mon, Apr 8 2019 1:06 PM | Last Updated on Mon, Apr 8 2019 1:06 PM

Ram Gopal Varma Cobra First Look Launch - Sakshi

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారమెత్రిన సంగతి తెలిసిందే. మొట్టమొదటి సారిగా ‘కోబ్రా’ అనే తన సినిమాలో ఓ ముఖ్య పాత్రలో  నటించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘‘బర్త్ డే అంటే నాకు చాలా చిరాకు. ఒక సంవత్సరం చావుకు దగ్గరవుతున్నామనిపిస్తుంటుంది నాకు. మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే.. అది సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కువ అర్థం ఉంటుందనేది నా అభిప్రాయం. ఇంత చెబుతున్న నేను.. ఈ సంవత్సరం ఎందుకు చేసుకుంటున్నానంటే ఈ రోజు నేను నటుడిగా పుట్టాను. కోబ్రా మూవీ స్క్రిప్ట్ రాస్తుంటే.. కొత్త రకమైన ఇంటెలిజిన్స్ ఆఫీసర్ పాత్రలో నేనే నటిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నాను.. ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మూవీతో ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ సినిమాకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే. నా కెరీర్ లో ‘క్షణక్షణం’ మ్యూజిక్ పరంగా ఓ మైలురాయి.  29 ఏళ్లకు మళ్లీ నేను, కీరవాణి గారు ఓ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నాం. చాలా హ్యపీ గా ఉంది’ అన్నారు.

సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి మాట్లాడుతూ.. ‘రామ్ గోపాల్ వర్మ గారు మంచి మ్యూజిక్ లవర్. ఆయన ఫస్ట్ టైమ్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవటం మనం ఊహించనిది. ఇలాంటి మార్పులు ఈ కోబ్రా లో మనం ఇంకా చూడొచ్చు. నాలో కొత్త కోణాన్ని ఈ చిత్రం ద్వారా రాము గారు బయటకు తీస్తారనుకుంటున్నాను. నటుడిగా కూడా ఆయనకు ఇది చాలెంజింగ్ సినిమా. ఎందుకంటే మనం నిజ జీవితంలో నటిస్తూ ఉంటాం. కానీ ఆయన నటించరు.. ఇప్పుడు నటించాల్సి ఉంటుంది.  29 ఏళ్ల క్షణక్షణం తర్వాత మళ్లీ రాముగారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చినందుకు ఆయనకు చాలా థాంక్స్’ అన్నారు.

ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాత డి.పి.ఆర్ మాట్లాడుతూ..  ‘‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ మీద ఈ కోబ్రా చిత్రాన్ని నిర్మించేందుకు అవకాశం ఇచ్చినందుకు వర్మగారికి ధన్యవాదాలు. సంవత్సరంలో 8 నుంచి 10 సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు మా బ్యానర్ మీద వర్మ గారితో తీస్తాం. ఆ ఐడియా ఇచ్చింది ఆయనే. దానికి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement