ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించిందో అందరికీ తెలిసిందే! ప్రపంచమే మెచ్చిన ఈ పాట బెస్ట్ ఒరిజినల్ విభాగంలో ఆస్కార్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఈ పాటను అందిచిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తాజాగా నాటునాటు పాటపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ తన యూట్యూబ్ ఛానల్‌లో కీరవాణిని ఇంటర్వ్యూ చేశారు. 'ఆస్కార్ వెనుక నాటు నిజం' పేరుతో తాజాగా ఈ ఎపిసోడ్ రిలీజ్ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ తనదైన స్టైల్‌లో ప్రశ్నలు అడిగారు. 'నాటు నాటు పాటకు మీరు కాకుండా ఇతరులు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసుంటే ఆస్కార్ పొందే అర్హత ఆ పాటకు ఉందని ఫీలయ్యేవారా?' అని ఆర్జీవీ ప్రశ్నించారు. దీనికి కీరవాణి మాట్లాడుతూ.. ఆ పాటకు ఆస్కార్ రావడానికి చాలా కారణాలున్నాయి. కేవలం ఒక పాటగా తీసుకుంటే మాత్రం ఆస్కార్ వచ్చినందుకు నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే జయహో పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా ఫీలవలేదు కాబట్టి! అని ఆన్సరిచ్చారు.
'నాటు నాటు పాట మీ కెరీర్‌లో టాప్ 100 సాంగ్స్‌లో ఉందని అనుకుంటున్నారా?' అని వర్మ ప్రశ్నించగా లేదని బదులిచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. 'ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు అవతలి వాళ్లకు నచ్చాలని మనం పని చేస్తున్నప్పుడు ముందు అది మనకు నచ్చాలి. నాకే నచ్చకపోతే ప్రపంచానికి ఎలా నచ్చుతుందని అనుకుంటాను? కొన్ని సార్లు ముందు నాకు నచ్చాలని చూస్తాను, మరికొన్ని సార్లు అవతలివాళ్లకు నచ్చాలని భావిస్తాను. ఇది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది' అని చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'ఆస్కార్ కమిటీలో ఓటు వేసే వాళ్లు దాదాపు పదివేల మంది దాకా ఉన్నారు. వీరంతా కూడా ఆస్కార్ ఎంట్రీకి వచ్చినవాటిలో కొన్నింటిని చూడకుండా వదిలేయవచ్చు. కాబట్టి మా సినిమా చూసి ఓటేయండి అని మనమే ప్రచారం చేసుకోవాలి. అలా వాళ్లు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూసే క్రమంలో పాత్రలు, కథ నచ్చి అందులో లీనమైపోయి నాటు నాటు పాట వచ్చేసరికి చప్పట్లు కొడుతూ దాన్ని ఎంజాయ్ చేసుంటారు. ఓవరాల్ సినిమా ఇంపాక్ట్ ఆ పాట మీద ఉండటంతో నాటునాటుకు ఓటు వేశారని నేను నమ్ముతున్నాను' అని తెలిపారు.
Here’s my #RGVNijam full interview with OSCAR @mmkeeravani https://t.co/rSYMS1C5lS
— Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2023
చదవండి: అందరిముందు ఎన్టీఆర నా కాళ్లు పట్టుకున్నారు: రోజా రమణి
పెళ్లై ముగ్గురు పిల్లలున్న హీరోను ప్రేమించిన హీరోయిన్.. పెళ్లి చేసుకున్నాక చిత్రహింసలు
Comments
Please login to add a commentAdd a comment