
సాక్షి, అమరావతి: చంద్రబాబు కోసం చంద్రబాబు చేత చంద్రబాబు కొరకు.. ఇదీ టీడీపీ ప్రభుత్వంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం. తనకేం సంబంధం లేదని చంద్రబాబు ఎంతగా బుకాయించినా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లు ఆయన బండారాన్నిబట్టబయలు చేస్తున్నాయి. కేవలం నిధులు కొల్లగొట్టేందుకే చంద్రబాబు ఆద్యంతం తానై వ్యవహరించారన్నది ఆధారాలతోసహా వెల్లడైంది.
కేబినెట్ ఆమోదం లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం నుంచి జీవోకు విరుద్ధంగా ఒప్పందం.. ఒప్పందానికి విరుద్ధంగా నిధులు అక్రమంగా విడుదల చేసే వరకు ఆయనే సర్వంతానై వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని స్వయంగా ఆదేశించారు.
కుంభకోణానికి మార్గం సుగమం చేస్తూ.. నిధులు కొల్లగొట్టేందుకు నోట్ ఫైళ్లలో 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేయగా, ఏ–2గా ఉన్న అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఐదు చోట్ల సంతకాలు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్–ట్రైనింగ్, సాధారణ పరిపాలన శాఖకు చెందిన మొత్తం 13 నోట్ ఫైళ్లలో చంద్రబాబు చేసిన సంతకాలు ఆయన ప్రత్యక్ష ప్రమేయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment