
ఖమ్మం మయూరి సెంటర్: సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిన ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఒకరోజు ఆలస్యంగా వచ్చారని ఖమ్మం జిల్లాలో బాండ్ పేపర్లపై సంతకాలు చేయించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ నెల 16 వరకు ఎస్సీ గురుకులాలకు సంక్రాంతి సెలవులు ఇవ్వగా, ఒకరోజు ఆలస్యంగా 18న (గురువారం) విద్యార్థులు తిరిగి వచ్చారు.
మరోసారి ఇలా ఆలస్యం జరగనీయమని రూ. 20 స్టాంప్ పేపర్‌పై వివరణ రాసి, తల్లిదండ్రుల చేత సంతకాలు చేసి సమర్పించాలని హుకుం జారీ చేశారు. ఖమ్మం ఆర్‌సీవో పుల్లయ్య నుంచి అనుమతి తీసుకురావాలని వెనక్కి పంపించడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఎస్సీ గురుకులాల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆర్‌సీవో కూడా అందుబాటులో లేకపోవడంతో.. ఆందోళన చేశారు. పీడీఎస్‌యూ నాయకులు మద్దతుగా నిలిచారు. దీంతో అధికారులు స్పందించి.. ఎలాంటి బాండ్లు లేకుండానే రెసిడెన్షియల్‌లోకి అనుమతించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment