సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీల అంశం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారా స్త్రం కానుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇందూరు కు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసి చ్చిన ధర్మపురి అర్వింద్ అనూహ్యంగా విజయం సాధించారు. ఈనెల 3న ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి పసుపు బోర్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీకి ఆదరణ పెరిగింది.
ఇదే తరహాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరి పించడం, చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచడమనే అంశాన్ని ఎజెండాగా తీసుకుని మరొక బాండ్ రాసి చ్చేందుకు అర్వింద్ రంగం సిద్ధంచేస్తున్నారు. ని జాం షుగర్ ఫ్యాక్టరీలు ఉమ్మడి నిజామాబాద్ (బో ధన్), ఉమ్మడి కరీంనగర్ (జగిత్యాల జిల్లా ముత్యంపేట), ఉమ్మడి మెదక్ (ముంబోజిపల్లి) జిల్లాల్లో ఉన్నాయి. దీంతో బీజేపీ ఎంపీ అర్వింద్ పార్టీ అధినాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లా డి తగిన కార్యాచరణ సిద్ధం చే స్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని చెరుకు పాలసీని స్టడీ చేస్తున్నారు.
యూపీలో మాదిరిగా చెరుకు పంట సాగుతో పాటు దాన్ని రెగ్యులేట్ చేసేందుకు షు గర్, బ్రౌన్ షుగర్, ఇథనాల్ అనే మూడు ఉత్పత్తుల తయారీకి ప్లాన్ చేస్తున్నారు. చెరుకుకు మద్దతు ధర ఇస్తున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదక ఖర్చు 30 శాతం ఎక్కువ ఉంటోంది. దీంతో షుగర్ ఎగుమతులు అంతగా చేయలేని పరిస్థితి. దీంతో ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో చెరుకు సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించేందుకు ఎంపీ అర్వింద్ ప్రణాళికలు సిద్ధం చేసుకుని పార్టీ నాయకత్వంతో ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ తెరిపిస్తామని హామీ ఇస్తోంది. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment