bond paper
-
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’ -
నిజాం షుగర్సే ప్రధాన ప్రచారాస్త్రం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీల అంశం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారా స్త్రం కానుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇందూరు కు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసి చ్చిన ధర్మపురి అర్వింద్ అనూహ్యంగా విజయం సాధించారు. ఈనెల 3న ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి పసుపు బోర్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీకి ఆదరణ పెరిగింది. ఇదే తరహాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరి పించడం, చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచడమనే అంశాన్ని ఎజెండాగా తీసుకుని మరొక బాండ్ రాసి చ్చేందుకు అర్వింద్ రంగం సిద్ధంచేస్తున్నారు. ని జాం షుగర్ ఫ్యాక్టరీలు ఉమ్మడి నిజామాబాద్ (బో ధన్), ఉమ్మడి కరీంనగర్ (జగిత్యాల జిల్లా ముత్యంపేట), ఉమ్మడి మెదక్ (ముంబోజిపల్లి) జిల్లాల్లో ఉన్నాయి. దీంతో బీజేపీ ఎంపీ అర్వింద్ పార్టీ అధినాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లా డి తగిన కార్యాచరణ సిద్ధం చే స్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని చెరుకు పాలసీని స్టడీ చేస్తున్నారు. యూపీలో మాదిరిగా చెరుకు పంట సాగుతో పాటు దాన్ని రెగ్యులేట్ చేసేందుకు షు గర్, బ్రౌన్ షుగర్, ఇథనాల్ అనే మూడు ఉత్పత్తుల తయారీకి ప్లాన్ చేస్తున్నారు. చెరుకుకు మద్దతు ధర ఇస్తున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదక ఖర్చు 30 శాతం ఎక్కువ ఉంటోంది. దీంతో షుగర్ ఎగుమతులు అంతగా చేయలేని పరిస్థితి. దీంతో ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో చెరుకు సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించేందుకు ఎంపీ అర్వింద్ ప్రణాళికలు సిద్ధం చేసుకుని పార్టీ నాయకత్వంతో ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ తెరిపిస్తామని హామీ ఇస్తోంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. -
‘ఓటేయ్యండి.. బాండ్ రాసిస్తా’
సాక్షి, నల్లగొండ : ‘నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే మీ దగ్గరినుంచి రూపాయి ఆశించను. ఇప్పుడు ఉన్న ఆస్తికంటే ఎక్కువ సంపాదిస్తే జప్తు చేసి ప్రజలకు పంచండి’అంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి వంద రూపాయల బాండ్ పేపర్‌పై సంతకం చేసి ప్రజలకు పంచుతూ ఓట్లను అభ్యర్థించాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సీపీఎం మద్దతుతో చిలుముల రమణ రామస్వామి బరిలో నిలిచారు. తనని సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ మంగళవారం రూ.100 బాండ్ పేపర్ జిరాక్స్ ప్రతులను ఇంటింటికి పంపిణీ చేశారు. -
బాండ్ రాసిస్తేనే బడిలోకి..
ఖమ్మం మయూరి సెంటర్: సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిన ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఒకరోజు ఆలస్యంగా వచ్చారని ఖమ్మం జిల్లాలో బాండ్ పేపర్లపై సంతకాలు చేయించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ నెల 16 వరకు ఎస్సీ గురుకులాలకు సంక్రాంతి సెలవులు ఇవ్వగా, ఒకరోజు ఆలస్యంగా 18న (గురువారం) విద్యార్థులు తిరిగి వచ్చారు. మరోసారి ఇలా ఆలస్యం జరగనీయమని రూ. 20 స్టాంప్ పేపర్‌పై వివరణ రాసి, తల్లిదండ్రుల చేత సంతకాలు చేసి సమర్పించాలని హుకుం జారీ చేశారు. ఖమ్మం ఆర్సీవో పుల్లయ్య నుంచి అనుమతి తీసుకురావాలని వెనక్కి పంపించడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఎస్సీ గురుకులాల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆర్సీవో కూడా అందుబాటులో లేకపోవడంతో.. ఆందోళన చేశారు. పీడీఎస్‌యూ నాయకులు మద్దతుగా నిలిచారు. దీంతో అధికారులు స్పందించి.. ఎలాంటి బాండ్లు లేకుండానే రెసిడెన్షియల్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. -
ప్రియుడి నాటకంలో అక్కాచెల్లెలు బలి
నేరేడ్మెట్: రామకృష్ణాపురం చెరువులో ఇద్దరు యువతుల ఆత్మహత్య కేసులో నేరేడ్మెట్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఇన్స్పెక్టర్ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం... మౌలాలి తిరుమలనగర్‌కు చెందిన చిరంజీవి కుమార్తె మౌనిక (20) ఘట్కేసర్లోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. మౌనిక వాయుపురి రోహిణి కాలనీకి చెందిన నాగార్జున అలియాస్ నాని (24) ప్రేమించుకుంటున్నారు. బీటెక్ చదివిన నాగార్జున శంషాబాద్‌లోని అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కులాలు వేరుకావడం, మౌనికను పెళ్లాడితే కట్నం కూడా రాదని భావించిన నాగార్జున మౌనికను పక్కన పెట్టాడు. వేరే అమ్మాయితో ఈనెల 4న పెళ్లి నిశ్చితార్థం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలాఉండగా... మౌలాలి తిరుమల టవర్స్‌లో ఉండే తన స్నేహితుడైన ఫొటోగ్రాఫర్ బాలకామేశ్వర్రావు అలియాస్ కామేష్ (24)ను మౌనికకు నాగార్జున పరిచయం చేశాడు. అది కాస్తా వారి మధ్య ప్రేమగా మారి మౌనికను కామేష్ పెళ్లాడతానని హామీ ఇచ్చాడు. అయితే, నాగార్జునను మరిచిపోలేకపోతున్న మౌనిక తరచూ అతడి పేరు కామేష్ ముందు ప్రస్తావించేది. దీంతో ఆగ్రహానికి గురైన కామేష్.. నాగార్జునతో కలిసి ఓ పథకం వేశాడు. ‘‘తనకు నాగార్జునకు ఎలాంటి సంబంధంలేదు, మళ్లీ నాగార్జునను ఇబ్బంది పెట్టను’’ అని మౌనికతో బాండ్ రాయించుకున్నారు. ఆ తర్వాత కామేష్ ఆమెను పలు రకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తూ వేధించడం ప్రారంభించాడు. ఓ వైపు కామేష్ వేధింపులు మరో వైపు ప్రేమికుడు నాగార్జునకు 4వ తేదీన పెళ్లి నిశ్చితార్థం జరుగుతుండటంతో జీవితంపై విరక్తి చెందిన మౌనికి ఆత్మహత్యకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా.. ఈమెకు వరుసకు చెల్లెలు సౌమ్య రాజేశ్వరి (16) స్వస్థలం పశ్చిమగోదావరిజిల్లా ఉండి. సౌమ్య తండ్రి బ్రహ్మానందశర్మ 2013లో, తల్లి వల్లికాదేవి 2014లో మృతి చెందారు. దీంతో సౌమ్యను పెద్దనాన్న నగరంలోని హాస్టల్లో ఉంచి ఇంటర్ చదివిస్తున్నాడు. సౌమ్యను మామలు సుబ్రహ్మణ్యం, నాగేశ్వరశర్మ, అత్త శ్రీదేవి కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. ఈమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో 20 రోజుల క్రితం అక్క మౌనిక ఇంటికి వచ్చింది. తాము ఎదుర్కొంటున్న వేధింపులు ఒకరికొకరు చెప్పుకున్న ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 4న రామకృష్ణాపురం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మౌనిక మృతికి కారణమైన కామేష్‌ను మంగళవారం రామకృష్ణాపురం రైల్వే స్టేషన్లో పట్టుకోగా... నాగార్జున నేరుగా ఠాణాకు వచ్చి లొంగిపోయాడు. దీంతో ఇద్దరినీ బుధవారం రిమాండ్‌కు తరలించారు. కాగా, సౌమ్య మృతికి కారణమైన ఇద్దరు మామలను, అత్తను త్వరలోనే అరెస్టు చేస్తామని ఇన్స్పెక్టర్ జగదీష్‌చందర్ అన్నారు.