నేడు వివిధ మార్గాల్లో పలు రైళ్ల రద్దు  | trains are canceled today on various routes | Sakshi
Sakshi News home page

నేడు వివిధ మార్గాల్లో పలు రైళ్ల రద్దు 

Published Mon, Sep 4 2023 5:11 AM | Last Updated on Mon, Sep 4 2023 5:11 AM

trains are canceled today on various routes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు కాజీపేట్‌–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్‌–డోర్నకల్, కాజీపేట్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్, బల్లా ర్ష– కాజీపేట్, సికింద్రాబాద్‌–వరంగల్, సి ర్పూర్‌ టౌన్‌–భద్రాచలం, వరంగల్‌– హైదరాబాద్, కరీంనగర్‌–సిర్పూర్‌టౌన్, కరీంనగర్‌–నిజామాబాద్, కాజీపేట్‌–బల్లార్ష, తదితర మార్గాల్లో  రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు.

ఎంఎంటీఎస్‌లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్‌–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement