ways
-
వేస్ అండ్ మీన్స్, ఓడీ పరిమితుల పెంపు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి రూ.47,010 కోట్లు ఉండగా, జూలై 1 నుంచి ఈ పరిమితిని రూ.60,118 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక వెసులుబాటు కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితిని పెంచేందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన కమిటీ సూచనల మేరకు ఈ పరిమితులను పెంచినట్లు ఆర్బీఐ పేర్కొంది.ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన సెక్యూరిటీలలో పెట్టుబడుల పరిమాణం, ట్రెజరీ బిల్లుల వేలం, గ్యారెంటీ రిడెంప్షన్ ఫండ్ తదితరాల ఆధారంగా ఈ పరిమితులను పెంచినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అత్యవసర వ్యయాలకు నిధులు లభ్యత లేని పక్షంలో ఆర్థిక వెసులుబాటుకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లను, ఓవర్ డ్రాఫ్ట్‌ల ద్వారా ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా నిధులను పొందేందుకు వెసులుబాటు కల్పిస్తారు.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి రూ.2,252 కోట్లు ఉండగా.. జూలై 1 నుంచి రూ.2,921 కోట్లకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే, మిగతా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ పరిమితులను పెంచింది. -
నేడు వివిధ మార్గాల్లో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లా ర్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష, తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
బరువు తగ్గడం..అంత బరువేం కాదు!
కొంతమంది శరీరతత్వాన్ని బట్టి బరువు పెరగడం, తగ్గడమనేది పెద్ద టాస్కే. మంచి పౌష్టికాహారం, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగడం సులభమే. కానీ దాన్ని తగ్గించుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇందుకు చాలా మంది సినీ తారలు కూడా నిదర్శనం. నిత్యం యోగా చేసే సినీతారలు, తదితర వంటి సెలబ్రిటీలే ఇంత కష్టపడుతుంటే.. మనలాంటి సామాన్యులు బరువు తగ్గడం సాధ్యమేనా అని నిరాశ పడొద్దు. బిజీ లైఫ్ వల్ల చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం చిక్కదు. అలాగని డైటింగ్ చేస్తూ కడుపు మాడ్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటారు. అలాంటివారికి ఈ కింది చిట్కాలు ఉపయోగ పడవచ్చు. స్పీడ్‌గా బరువు తగ్గాలంటే.. మంచి నీటిని తరచు తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండిన భావన కలుగుతుంది. 12 వారాలపాటు చేసిన ఓ అధ్యయనంలో భోజనానికి ముందు నీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతార ని తేలింది. అలాగే కంటినిండా నిద్ర పోయినా బరువు తగ్గతారని పరిశోధనలో తేలింది టీవి చూస్తూనో సెల్ ఫోన్ చూస్తూ కూడా తిన్న బరువు పెరుగుతారట. ఇలాంటి అలవాటును మానుకునే యత్నం చేసినా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ మూడు టెక్నిక్‌లు ఫాలో అయితే స్పీడ్‌గా బరువు తగ్గొచ్చు ఈజీగా బరువు తగ్గేందుకు ఏం చేయాలో..ఏం చేయకూడదో చూద్దాం. ఆహారాన్ని కంగారుగా తినకూడదు. నెమ్మదిగా నమిలి తినాలి. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. నెమ్మదిగా ఆహారం తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. మీరు రోజూ తీసుకొనే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ఆకలి తగ్గితే శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరతాయి. జీఎల్పీ–1, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రొటీన్లు ప్రభావం చూపడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తియ్యని శీతలపానీయల జోలికి వెళ్లొద్దు. సోడా కలిగిన డ్రింక్స్ వల్ల రోగాల ముప్పు పెరుగుతుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. కంటి నిండా నిద్రలేకపోయినా సరే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలై ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక రుగ్మతలు వస్తాయి. యోగర్ట్, లెంటిల్స్, క్వినోవా, చికెన్ బ్రెస్ట్, చేపలు, ఆల్మండ్స్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. మొక్కల నుంచి లభించే విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. బీన్స్, ఓట్స్ సెరల్స్, బ్రస్సెల్స్ స్ప్రౌర్ట్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో విస్కోస్ ఉంటుంది. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. కంచం నిండుగా భోజనం చేస్తే బరువు కూడా అదే స్థాయిలో పెరుగుతారు. ఆకలి వేసినప్పుడు మధ్య మధ్యలో బాదం తదితర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వీడియోలు చూస్తూ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు.ఎందుకంటే.. వాటి ధ్యాసలో పడి అతిగా తినేస్తారు కాబట్టి తింటున్నా అన్న భావనతో తినడం మంచిది. (చదవండి: ఆకస్మిక మైకం.. తరచు తలనొప్పా?) -
జల రవాణాపై ఏపీతో చర్చలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ చెప్పారు. అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకూ న్యూఢిల్లీలో జరిగే గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్–2023కి అనుబంధంగా డీసీఐలో ఈ నెల 28న రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లను ఎండీ దివాకర్ పరిశీలించారు. డీసీఐ పురోగతికి తీసుకుంటున్న చర్యలు, సమ్మిట్‌కు సంబంధించిన విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. జలరవాణాపై సంప్రదింపులు ప్రస్తుతం జీడీపీ విలువలో 80 శాతం వరకూ మారి టైమ్ ట్రేడ్ జరుగుతోంది. డ్రెడ్జింగ్ చేయకుండా ఏ పోర్టు అభివృద్ధి జరగదు. అందుకే ప్రధాని కూడా దేశీయ జలమార్గాల (ఇన్లాండ్ వాటర్ వేస్)పై దృష్టి సారించారు. ప్రస్తుతం 110 నదులుండగా కేవలం 4 నదుల్లో జల రవాణాకు సంబంధించి డ్రెడ్జింగ్ పనుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పూడికతో నిండిపోయిన డ్యామ్‌లు, రిజర్వాయర్లలోనూ డ్రెడ్జ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం చిన్నచిన్న డ్రెడ్జర్లు అవసరం అవుతాయి. దీనిపైనా సమాలోచనలు చేస్తున్నాం. డ్రెడ్జ్ చేస్తే.. వాటర్ క్యాచ్మెంట్ ఏరియా పెరుగుతుందని ఇందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాం. ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరిపాం. ఏ ప్రభుత్వమైనా డ్యామ్‌లు, రిజర్వాయర్ల డ్రెడ్జింగ్ పనుల్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ అప్పగిస్తే కొత్త డ్రెడ్జర్లు తీసుకుంటాం. దేశంలో డ్రెడ్జింగ్ కోసం 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకూ డిమాండ్ ఉంది. కానీ.. డీసీఐలో ప్రస్తుతం 59 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న10 టీఎస్‌హెచ్ డ్రెడ్జర్లు, 6 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న 2 కట్టర్ సీఎస్ డ్రెడ్జర్లు, ఒక బీహెచ్వో డ్రెడ్జర్ ఉన్నాయి. 12 వేల టన్నుల హోపర్ కెపాసిటీ డ్రెడ్జర్ కోసం ఆర్డర్ చేశాం. 2025 డిసెంబర్ నాటికి ఇది రానుంది. రూ.12 వేల కోట్ల వరకూ ఎంవోయూలు 2021లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.14 వేల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నాం. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల వరకూ వస్తాయని భావి స్తున్నాం. ఇందుకోసం 28న డీసీఐలో నిర్వహించే రోడ్‌షోలో షిప్ బిల్డర్స్, షిప్ ఆపరేటర్స్,పోర్టులు, రెగ్యులేటరీస్, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తాం. ఏపీలో 4 పోర్టుల రాకతో అపార అవకాశాలు ఏపీ ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని చురుగ్గా నిర్వహిస్తోంది. కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలలో నిర్మిస్తున్న పోర్టుల ద్వారా అపారమైన అవకాశాలు కలగనున్నాయి. ఈ నాలుగు పోర్టుల్లో కనీసం 150 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మచిలీపట్నంలో పనులు చేపడుతున్నాం. మిగిలిన పోర్టుల్లోనూ పనుల కోసం మరిన్ని డ్రెడ్జర్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. -
పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే..
Income tax return filing, maximise tax refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు గడువు సమీపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2023-24) ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గుడువు తేదీని గుర్తు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్వీట్ చేసింది. తమ ఆదాయాలకు తగిన దాని కంటే ఎక్కువగా పన్నులు చెల్లించిన ట్యాక్స్ పేయర్లు రీఫండ్ పొందవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో రీఫండ్ మొత్తాన్ని లెక్కించి ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత రీఫండ్ మొత్తం సంబంధిత ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలో జమవుతుంది. ఫారమ్ 16లో చూపిన దానికంటే ఎక్కువగా పన్ను ఆదా చేసుకునే అవకాశం లేదనే అపోహ చాలా మందిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్ను ఆదాకు ఫారమ్ 16 ఒక్కటే మార్గం కాదు. రిటర్న్‌లను దాఖలు చేయడానికి ముందు 26AS, వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS)తో ఆదాయ వివరాలను చెక్ చేయండి. 26ASలో టీడీఎస్ ప్రతిబింబిస్తే టీడీఎస్‌ని క్లెయిమ్ చేయవచ్చు లేదా చెల్లించాల్సిన పన్ను మొత్తానికి సర్దుబాటు చేసుకోవచ్చు. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్ ఐటీఆర్ దాఖలు సమయంలో ఈ కింది ఐదు సూత్రలను పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి మీ రిటర్న్‌లను సకాలంలో ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఇది గరిష్ట రీఫండ్ పొందడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(1) కింద నిర్దేశించిన తేదీలోగా పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఫారమ్‌ను సమర్పించాలి. ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యమైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. సరైన పన్ను విధానం ఎంపిక మీ నచ్చిన, మీ అవసరాలకు సరిపోయే పన్ను విధానాన్ని ఎంచుకుని ఐటీఆర్ ఫైల్ చేయండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ELSS), హోమ్ లోన్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌పై వడ్డీ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు లేనివారికి కొత్త పన్ను విధానం సరిపోతుంది. తగ్గింపులు, మినహాయింపులకు బదులుగా ఇందులో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. ఈ-రిటర్న్ ధ్రువీకరణ ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజులలోపు పన్ను రిటర్న్‌ని ధ్రువీకరించాలి. రిటర్న్ ధృవీకరించని పక్షంలో దాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు. చివరి తేదీ దాటినట్లయితే మళ్లీ ఐటీఆర్ సమర్పించాలి. ఆధార్‌తో లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ కోడ్ వంటి మార్గాల్లో ఈ-రిటర్న్ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు. తగ్గింపులు, మినహాయింపుల క్లెయిమ్ క్లెయిమ్ చేయగల తగ్గింపులు, మినహాయింపులను గుర్తించాలి. ఇవి మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. ట్యాక్స్ రీఫండ్‌ను పెంచుతుంది. పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, గృహ రుణంపై వడ్డీ వంటి వాటితో ప్రామాణిక తగ్గింపులు పొందవచ్చు. ఫారమ్ 16లో ప్రతిబింబించే తగ్గింపులను మాత్రమే లెక్కించకూడదు. అందులో ప్రతిబింబించని అనేక పన్ను పొదుపు ఖర్చులను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు పిల్లల పాఠశాల ట్యూషన్ ఫీజు. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను ఆదా ఖర్చులు, పెట్టుబడులను పునఃపరిశీలించడం మంచిది. బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ మీ బ్యాంక్ ఖాతాను ప్రామాణీకరించడంతోపాటు ఆదాయపు పన్ను రిటర్న్ పోర్టల్‌లో సరిగ్గా ధ్రువీకరించినట్లుగా నిర్ధారించుకోండి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించిన ఖాతాలకు మాత్రమే ఐటీ అధికారులు క్రెడిట్ రీఫండ్లు చేస్తారు. కాబట్టి ధ్రువీకరణ ప్రక్రియ చాలా ముఖ్యం. రిటర్న్‌లు దాఖలు చేసే ముందే మీ అకౌంట్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. Do finish this important task and unwind this weekend. The due date to file your #ITR for AY 2023-24 is 31st July, 2023.#FileNow and spend your weekend without any worry. Pl visit https://t.co/GYvO3mStKf#ITD pic.twitter.com/ngLwU8Hzbi — Income Tax India (@IncomeTaxIndia) July 15, 2023 -
వేగంగా రోడ్డు విస్తరణ పనులు
కలెక్టర్ కార్తికేయ ఆదేశం కాకినాడ సిటీ : జిల్లాలో జాతీయ రహదారి 216, ఏడీబీ రోడ్డు విస్తరణ పనులకు భూసేకరణ పనులు వేగవంతం చేసి, ప్రాజెక్ట్ పనులు సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టుహాలులో రెవెన్యూ, నేషనల్ హైవేస్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్‌హెచ్ 216, ఏడీబీ రోడ్ల భూసేకరణ పనులను డివిజన్ల వారీగా సమీక్షించారు. సమావేశానికి ఎన్‌హెచ్ 216 ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్‌ను వెనక్కు పంపించి వేశారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే 216 భూసేకరణపై ప్రజల నుంచి పలు వినతులు వచ్చాయని ఈ మేరకు పనుల కోసం చేపట్టిన భూసేకరణలో పెగ్ మార్కింగ్ కన్నా ఎక్కువ భూమిని తీసుకున్నచోట్ల సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ఈ సర్వేను రెవెన్యూ, సంబంధిత ఏజెన్సీ ద్వారా చేపట్టి స్థానిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రెండు, మూడు రోజుల్లో సమగ్ర పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని ఆయ మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. భూసేకరణలో భాగంగా ఏడీబీ రోడ్డు పనుల్లో ఆక్రమణలో ఉన్నవారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తున్నాం గాని ఎన్‌హెచ్ 216 పనుల్లో ఆక్రమణల్లో ఉన్నవారికి పరిహారం చెల్లించడం లేదని మతపరమైన కట్టడాలను మాత్రమే ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే చర్యలు చేపడుతున్నారని జేసీ–2 రాధాకృష్ణమూర్తి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, ఆర్డీవోలు ఎల్.రఘుబాబు, విశ్వేశ్వరరావు, సంబంధిత మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
మద్యం వ్యాపారులకు షాక్
– సుప్రీం ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అబ్కారీ శాఖ – జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న దుకాణాల లైసెన్సులు నెలాఖరుతో రద్దు – 500 మీటర్ల దూరంలో పెట్టుకునేందుకు అనుమతి – జిల్లాలో 500 మద్యం దుకాణాలు – సుప్రీం తీర్పునకు ప్రభావితమయ్యే దుకాణాలు 376 – జూన్ వరకు లైసెన్స్ ఉండడంతో ఆందోళనలో వ్యాపారులు – రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో వేసిన పిటీషన్‌పై ఆశలు సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను ఏప్రిల్ 1వ తేదీలోపు తొలగించాలని గత డిసెంబర్ 15న సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును రాష్ట్ర అబ్కారీ శాఖ అమలులో పెడుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలను నడపడమే కారణమని సుప్రీం కోర్టు పై విధంగా తీర్పు వెలువరించిన విషయం విదితమే. గురువారం జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణ యజమానులకు అబ్కారీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. రెండేళ్ల వరకు మద్యం దుకాణాల నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు జూన్ 30 వరకు ఉండడంతో తాము తీవ్రంగా నష్టపోతామని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 500 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి 376 దుకాణాలున్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. సుప్రీం తీర్పు ప్రభావం జిల్లాలో 376 (75 శాతం) దుకాణాలపై పడుతోంది. తాము మద్యం వ్యాపారులకు ఇచ్చిన లైసెన్స్ జూన్ 30 వరకు ఉందని, అప్పటి వరకు వెలుసుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. వారం రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని అబ్కారీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠలో మద్యం వ్యాపారులున్నారు. మరోచోట ఏర్పాటుకు అబ్కారీ అధికారులతో కమిటీ కోర్టు తీర్పు ప్రకారం మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో ఉండాలి. వాటిని చేరుకునేందుకు నేరుగా మార్గం ఉండకూడదు. అంతేకాకుండా జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి కనిపించే విధంగా ఉండకూడదు. రహదారులపై ఉంటే వాటి లైసెన్స్ రద్దు అవుతుంది. అయితే అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో కనిపించకుండా ఉండే ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేసుకుంటే ఆ లైసెన్స్ జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది. మద్యం వ్యాపారులు నష్టపోకుండా ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్, సంబంధింత డివిజన్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మద్యం వ్యాపారులు స్థలం ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకుంటే ఈ కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేస్తుంది. ఆందోళనలో మద్యం వ్యాపారులు... వచ్చే మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) మద్యం వ్యాపారానికి మంచి సీజన్. వేసవి కాలం కావడంతో బీర్ల అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. ఏడాదంతా చేసిన వ్యాపారం ఒక ఎత్తయితే చివరి మూడు నెలలు చేసే వ్యాపారం మరో ఎత్తు. సుప్రీం తీర్పు నేపథ్యంలో తాము తీవ్రంగా నష్టపోతామని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 500 దుకాణాల్లో జాతీయ రహదారుల వెంట కేవలం 36 మద్యం దుకాణాలున్నాయి. రాష్ట్ర రహదారులు వెంట 340 మద్యం దుకాణాలు న్నాయి. జాతీయ రహదారులు నగరాలు, పట్టణాలకు వెలుపల వెళుతుండగా, రాష్ట్ర రహదారులు మాత్రం పట్టణాలు, నగరాలల్లో ఉన్నాయి. దీంతో అధిక సంఖ్యలో మద్యం దుకాణాలు సుప్రీం తీర్పునకు ప్రభావితం అవుతున్నాయి. 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు ఉన్నా ఇప్పటికిప్పుడు స్థలం దొరకడం కష్టమని మద్యం వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దొరికినా దుకాణం ఏర్పాటు, స్థలం లీజు ధర యజమాని ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉందని వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న దుకాణానికి జూన్ వరకు అద్దె చెల్లించామని, ఇప్పడు అది కోల్పోవడంతోపాటు, కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. సుప్రీం తీర్పును అమలు చేస్తున్నాం... డిసెంబర్ 15న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని వాటి యజమానులకు గురువారం నోటీసులు జారీ చేశాం. 500 మీటర్ల దూరంలో తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు మద్యం వ్యాపారి స్థలం చూసుకుని దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం. ఇందుకు డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిషనర్ కమిటీ వేశారు. బడి, గుడి, ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో, ఇతర నిబంధనలకు అనుగుణంగా స్థలం ఉంటే కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తీర్పులో జూన్ వరకు వెలుసుబాటు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ వేసింది. అతి త్వరలో దీనిపై విచారణ జరగనుంది. – ఎస్. లక్ష్మీకాంత్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, అబ్కారీ శాఖ, రాజమహేంద్రవరం.