Income tax return filing: 5 easy ways to maximise tax refund - Sakshi
Sakshi News home page

ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. 

Published Sun, Jul 16 2023 8:01 PM | Last Updated on Mon, Jul 17 2023 10:28 AM

Income tax return filing 5 easy ways to maximise tax refund - Sakshi

Income tax return filing, maximise tax refund: ఆదాయపు పన్ను రిటర్న్స్‌ (ITR)  దాఖలుకు గడువు సమీపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2023-24) ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గుడువు తేదీని గుర్తు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్వీట్ చేసింది.

తమ ఆదాయాలకు తగిన దాని కంటే ఎక్కువగా పన్నులు చెల్లించిన ట్యాక్స్‌ పేయర్లు రీఫండ్‌ పొందవచ్చు. ఐటీఆర్‌ ఫైల్ చేసే సమయంలో రీఫండ్ మొత్తాన్ని లెక్కించి ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాసెస్‌ చేస్తారు. ఆ తర్వాత రీఫండ్‌ మొత్తం సంబంధిత ట్యాక్స్‌ పేయర్ల అకౌంట్లలో జమవుతుంది. 

ఫారమ్ 16లో చూపిన దానికంటే ఎక్కువగా పన్ను ఆదా చేసుకునే అవకాశం లేదనే అపోహ చాలా మందిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్ను ఆదాకు ఫారమ్ 16 ఒక్కటే మార్గం కాదు. రిటర్న్‌లను దాఖలు చేయడానికి ముందు 26AS, వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS)తో ఆదాయ వివరాలను చెక్‌ చేయండి. 26ASలో టీడీఎస్‌ ప్రతిబింబిస్తే టీడీఎస్‌ని క్లెయిమ్ చేయవచ్చు లేదా చెల్లించాల్సిన పన్ను మొత్తానికి సర్దుబాటు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి ➤ ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఐటీఆర్‌ దాఖలు సమయంలో ఈ కింది ఐదు సూత్రలను పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది.

సకాలంలో ఐటీఆర్‌ ఫైలింగ్‌
పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి మీ రిటర్న్‌లను సకాలంలో ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఇది గరిష్ట రీఫండ్‌ పొందడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(1) కింద నిర్దేశించిన తేదీలోగా పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఫారమ్‌ను సమర్పించాలి. ఐటీఆర్‌ ఫైల్ చేయడం ఆలస్యమైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

సరైన పన్ను విధానం ఎంపిక
మీ నచ్చిన, మీ అవసరాలకు సరిపోయే పన్ను  విధానాన్ని ఎంచుకుని ఐటీఆర్ ఫైల్ చేయండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ELSS), హోమ్ లోన్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌పై వడ్డీ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు లేనివారికి కొత్త పన్ను విధానం సరిపోతుంది. తగ్గింపులు,  మినహాయింపులకు బదులుగా ఇందులో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి.

ఈ-రిటర్న్‌ ధ్రువీకరణ
ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజులలోపు పన్ను రిటర్న్‌ని ధ్రువీకరించాలి. రిటర్న్ ధృవీకరించని పక్షంలో దాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు. చివరి తేదీ దాటినట్లయితే మళ్లీ ఐటీఆర్‌ సమర్పించాలి. ఆధార్‌తో లింక్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్‌, ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ కోడ్ వంటి మార్గాల్లో ఈ-రిటర్న్‌ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు.

తగ్గింపులు, మినహాయింపుల క్లెయిమ్ 
క్లెయిమ్ చేయగల తగ్గింపులు, మినహాయింపులను గుర్తించాలి. ఇవి మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. ట్యాక్స్‌ రీఫండ్‌ను పెంచుతుంది. పీపీఎఫ్‌, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, గృహ రుణంపై వడ్డీ వంటి వాటితో ప్రామాణిక తగ్గింపులు పొందవచ్చు. ఫారమ్ 16లో ప్రతిబింబించే తగ్గింపులను మాత్రమే లెక్కించకూడదు. అందులో ప్రతిబింబించని అనేక పన్ను పొదుపు ఖర్చులను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు పిల్లల పాఠశాల ట్యూషన్ ఫీజు. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను ఆదా ఖర్చులు, పెట్టుబడులను పునఃపరిశీలించడం మంచిది.

బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ
మీ బ్యాంక్ ఖాతాను ప్రామాణీకరించడంతోపాటు ఆదాయపు పన్ను రిటర్న్ పోర్టల్‌లో సరిగ్గా ధ్రువీకరించినట్లుగా నిర్ధారించుకోండి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించిన ఖాతాలకు మాత్రమే ఐటీ అధికారులు క్రెడిట్ రీఫండ్‌లు చేస్తారు. కాబట్టి ధ్రువీకరణ ప్రక్రియ చాలా ముఖ్యం. రిటర్న్‌లు దాఖలు చేసే ముందే మీ అకౌంట్‌ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement