Tax refund
-
ట్యాక్స్ రీఫండ్.. పన్ను చెల్లింపుదారులూ జాగ్రత్త!
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు పూర్తయి పన్నుచెల్లింపుదారులు ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.మోసపూరిత కాల్స్, పాప్-అప్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ సోషల్ మీడియా ద్వారా సూచించింది. ఒకవేళ అలాంటి సందేశం వచ్చినట్లయితే, అది ఐటీ శాఖ నుంచి వచ్చినదేనా అని అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.“క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే ఈమెయిల్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు లేదా వెబ్సైట్లను సందర్శించవద్దు. పన్ను చెల్లింపుదారులను అందించిన ఈమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే వారిని ఆదాయపు పన్ను శాఖ సంప్రదించవచ్చు” అని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది.pic.twitter.com/d5oVz6aiPW— Income Tax Mumbai (@IncomeTaxMum) August 15, 2024 -
ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కావాలంటే ఇది తప్పనిసరి!
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిఫండ్స్ పొందడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ సైట్లో తమ బ్యాంకు ఖాతాను రీ వ్యాలిడేట్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. బ్రాంచ్ మార్పులు, ఐఎఫ్ఎస్సీ మార్పులు లేదా బ్యాంకు విలీనాల కారణంగా బ్యాంక్ ఖాతా డేటాను అప్డేట్ చేసినప్పుడు రీ వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.ట్యాక్స్ పేయర్స్ తమ బ్యాంక్ అకౌంట్లను రీ వ్యాలిడేషన్ చేసుకునేందుకు చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్ లో రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి. రీ వ్యాలిడేషన్ చేసే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా పాన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. అలాగే కొత్త బ్యాంకు ఖాతాను జోడించాలన్నా కూడా ఆ ఖాతాను పాన్‌తో లింక్ చేసి ఉండాలి. యూజర్ కు చెల్లుబాటు అయ్యే ఐఎఫ్ఎస్సీ కోడ్, అకౌంట్ నెంబరు ఉండాలి.ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాను రీవాల్యులేట్ చేయండిలా..స్టెప్ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండిస్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి.స్టెప్ 3 'బ్యాంక్ అకౌంట్' ఎంచుకుని రీవాలిడేట్ మీద క్లిక్ చేయండి.స్టెప్ 4: అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ, ఏసీ టైప్ వంటి బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయండి.స్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి.కొత్త బ్యాంకు అకౌంట్‌ను జోడించడానికి..స్టెప్ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండిస్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.స్టెప్ 3: మై బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయండి (జోడించబడిన, విఫలమైన మరియు తొలగించబడిన బ్యాంక్ అకౌంట్స్ ట్యాబ్ లు డిస్ ప్లే అవుతాయి.)స్టెప్ 4: బ్యాంక్ ఖాతాను జోడించండిస్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి. Kind Attention Taxpayers!✅Having a validated bank account is essential for receiving of refunds. ✅An already validated bank account will require re-validation after updation of account details consequent to change in branch, IFSC, Merger of bank, etc.For Updating existing… pic.twitter.com/9DnuSMaYbP— Income Tax India (@IncomeTaxIndia) June 4, 2024 -
ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి భారీ మొత్తంలో ఎల్ఐసీకి ట్యాక్స్ రిఫండ్!
ఫిబ్రవరి 14, 2024న ఆదాయపు పన్ను శాఖ నుంచి సుమారు రూ.21,740 కోట్ల మొత్తాన్ని రిఫండ్ పొందినట్లు ఎల్ఐసీ తెలిపింది. 2012-13, 2013-14, 2014-15, 2016-17, 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించి ఎల్ఐసీ రీఫండ్ ఆర్డర్లను పొందిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ రీఫండ్ మొత్తం విలువ రూ.25,464.46 కోట్లు. దీనికి సంబంధించి, ఆదాయపు పన్ను శాఖ నిన్న రూ.21,740.77 కోట్లను విడుదల చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం నుంచి మిగిలిన మొత్తాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ తెలిపింది. -
Income Tax: బకాయిలుంటే ట్యాక్స్ రీఫండ్‌లో కటింగ్!
ఆదాయపు పన్ను బకాయిలను వసూలు చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (Income Tax Department) సరికొత్త ప్రణాళిక రచించింది. బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ (Tax refund) తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) ప్రాసెసింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసేందుకు, రీఫండ్ల జారీని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. (New Rules: అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..) పన్ను బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెండింగ్‌లో ఉన్న బకాయిలను సర్దుబాటు చేసి ట్యాక్స్ రీఫండ్లను సకాలంలో జారీ చేయడానికి సహకరించాలని కోరింది. బకాయిల సర్దుబాటుపై తమ సమ్మతిని తెలియజేయడానికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 245(1) ట్యాక్స్ పేయర్లకు అవకాశం కల్పిస్తుంది. దీని ప్రకారం.. బకాయిల సర్దుబాటుపై తమ అంగీకరిస్తున్నారో.. లేదో అని తెలియజేయాల్సి ఉంటుంది. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) 2023-24 అసెస్మెంట్ ఇయర్ కోసం 7.09 కోట్ల రిటర్న్‌లు దాఖలుకాగా 6.96 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ వెరిఫై చేసింది. ఇక ఇప్పటివరకు వీటిలో 2.75 కోట్ల రిటర్న్స్‌కు ట్యాక్స్ రీఫండ్‌ను చెల్లించగా 6.46 కోట్ల రిటర్న్‌లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. -
ట్యాక్స్ రీఫండ్ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా?
ఆదాయపు పన్ను రీఫండ్ ప్రాసెసింగ్ ఇప్పుడు వేగంగా మారింది. ట్యాక్స్ రీఫండ్ల కోసం వారాల పాటు వేచి ఉండాల్సి పని లేదు. 2023-24 అసెస్మెంట్ ఇయర్‌కు గానూ ఇటీవల తమ ఐటీ రిటర్న్‌లను దాఖలు చేసిన చాలా మందికి కొన్ని రోజుల్లోనే ట్యాక్స్ రీఫండ్ వచ్చింది. తాను ఐటీఆర్ ఫైల్ చేసిన 12 గంటల్లోనే ట్యాక్స్ రీఫండ్ పొందినట్లు ఓ పన్ను చెల్లింపుదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన నిర్ణయ్ కపూర్ అనే ట్విటర్ యూజర్ తన ఐటీఆర్ ఫైలింగ్, ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ మెసేజ్ స్క్రీన్షాట్లను షేర్ చేశారు. ట్యాక్స్ రీఫండ్‌ను ఇంత వేగంగా ప్రాసెస్ చేయడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాసుకొచ్చారు. నిర్ణయ్ కపూర్ జూలై 27 ఉదయం తన ఐటీ రిటర్న్‌ను దాఖలు చేయగా అదే రోజు సాయంత్రంలోగా ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ట్యాక్స్ ఫైలింగ్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఐటీఆర్ ఫైలింగ్, రీఫండ్ ప్రాసెసింగ్‌లో వేగం పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఐటీఆర్‌లు దాఖలు చేసిన ఒక్కరోజులోనే ప్రాసెస్ చేయడం గతేడాదితో పోలిస్తే వంద శాతం పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవారు రిఫండ్ ప్రాసెసింగ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్యాక్స్ నిపుణలు చెబుతున్నారు. మునుపటితో పోలిస్తే ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్యవస్థ ఇప్పుడు చాలా వేగంగా మారిందని, పన్ను చెల్లింపుదారులు ముందస్తు రీఫండ్‌కు అర్హులు కావాలంటే వీలైనంత త్వరగా తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా మందికి తెలియని మరో ప్రయోజనం కూడా ఉంది. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ రీఫండ్‌పై నెలకు 0.5 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తుందని తెలిసిందే. అయితే మీరు ఐటీఆర్ దాఖలు చేసినప్పటి నుంచి ఇది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఆ ప్రయోజనం పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి గడువు తేదీ జూలై 31. కాగా జూలై 27 వరకు, 5 కోట్లకు పైగా రిటర్న్‌లు దాఖలయ్యాయి. అలాగే ఇప్పటికే 2.69 కోట్ల వెరిఫైడ్ ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. -
పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే..
Income tax return filing, maximise tax refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు గడువు సమీపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2023-24) ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గుడువు తేదీని గుర్తు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్వీట్ చేసింది. తమ ఆదాయాలకు తగిన దాని కంటే ఎక్కువగా పన్నులు చెల్లించిన ట్యాక్స్ పేయర్లు రీఫండ్ పొందవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో రీఫండ్ మొత్తాన్ని లెక్కించి ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత రీఫండ్ మొత్తం సంబంధిత ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలో జమవుతుంది. ఫారమ్ 16లో చూపిన దానికంటే ఎక్కువగా పన్ను ఆదా చేసుకునే అవకాశం లేదనే అపోహ చాలా మందిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్ను ఆదాకు ఫారమ్ 16 ఒక్కటే మార్గం కాదు. రిటర్న్‌లను దాఖలు చేయడానికి ముందు 26AS, వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS)తో ఆదాయ వివరాలను చెక్ చేయండి. 26ASలో టీడీఎస్ ప్రతిబింబిస్తే టీడీఎస్‌ని క్లెయిమ్ చేయవచ్చు లేదా చెల్లించాల్సిన పన్ను మొత్తానికి సర్దుబాటు చేసుకోవచ్చు. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్ ఐటీఆర్ దాఖలు సమయంలో ఈ కింది ఐదు సూత్రలను పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి మీ రిటర్న్‌లను సకాలంలో ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఇది గరిష్ట రీఫండ్ పొందడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(1) కింద నిర్దేశించిన తేదీలోగా పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఫారమ్‌ను సమర్పించాలి. ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యమైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. సరైన పన్ను విధానం ఎంపిక మీ నచ్చిన, మీ అవసరాలకు సరిపోయే పన్ను విధానాన్ని ఎంచుకుని ఐటీఆర్ ఫైల్ చేయండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ELSS), హోమ్ లోన్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌పై వడ్డీ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు లేనివారికి కొత్త పన్ను విధానం సరిపోతుంది. తగ్గింపులు, మినహాయింపులకు బదులుగా ఇందులో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. ఈ-రిటర్న్ ధ్రువీకరణ ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజులలోపు పన్ను రిటర్న్‌ని ధ్రువీకరించాలి. రిటర్న్ ధృవీకరించని పక్షంలో దాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు. చివరి తేదీ దాటినట్లయితే మళ్లీ ఐటీఆర్ సమర్పించాలి. ఆధార్‌తో లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ కోడ్ వంటి మార్గాల్లో ఈ-రిటర్న్ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు. తగ్గింపులు, మినహాయింపుల క్లెయిమ్ క్లెయిమ్ చేయగల తగ్గింపులు, మినహాయింపులను గుర్తించాలి. ఇవి మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. ట్యాక్స్ రీఫండ్‌ను పెంచుతుంది. పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, గృహ రుణంపై వడ్డీ వంటి వాటితో ప్రామాణిక తగ్గింపులు పొందవచ్చు. ఫారమ్ 16లో ప్రతిబింబించే తగ్గింపులను మాత్రమే లెక్కించకూడదు. అందులో ప్రతిబింబించని అనేక పన్ను పొదుపు ఖర్చులను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు పిల్లల పాఠశాల ట్యూషన్ ఫీజు. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను ఆదా ఖర్చులు, పెట్టుబడులను పునఃపరిశీలించడం మంచిది. బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ మీ బ్యాంక్ ఖాతాను ప్రామాణీకరించడంతోపాటు ఆదాయపు పన్ను రిటర్న్ పోర్టల్‌లో సరిగ్గా ధ్రువీకరించినట్లుగా నిర్ధారించుకోండి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించిన ఖాతాలకు మాత్రమే ఐటీ అధికారులు క్రెడిట్ రీఫండ్లు చేస్తారు. కాబట్టి ధ్రువీకరణ ప్రక్రియ చాలా ముఖ్యం. రిటర్న్‌లు దాఖలు చేసే ముందే మీ అకౌంట్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. Do finish this important task and unwind this weekend. The due date to file your #ITR for AY 2023-24 is 31st July, 2023.#FileNow and spend your weekend without any worry. Pl visit https://t.co/GYvO3mStKf#ITD pic.twitter.com/ngLwU8Hzbi — Income Tax India (@IncomeTaxIndia) July 15, 2023 -
16 రోజుల్లో ఐటీ రీఫండ్స్ చెల్లింపులు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లింపులను (రిఫండ్) సగటున 16 రోజుల్లో పూర్తి చేస్తోంది. 2022–23 సంవత్సరాలో సగటు రిఫండ్ సమయం 16 రోజులకు తగ్గినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. 80 శాతం రిఫండ్లను రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోనే విడుదల చేసినట్టు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపుదారులు సులభంగా, వేగంగా రిటర్నులు దాఖలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఐటీఆర్ దాఖలు చేసిన ఒక్కరోజులోనే వాటిని ప్రాసెస్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా ఒక్క రోజులో ప్రాసెస్ చేసినవి 2021–22లో 21 శాతం ఉంటే, 2022–23లో 42 శాతానికి పెరిగినట్టు వెల్లడించారు. టెక్నాలజీ సామర్థ్యం గురించి మాట్లాడుతూ.. 2022 జూన్ 28న ఒకే రోజు 22.94 లక్షల రిటర్నుల ప్రాసెసింగ్ నమోదైనట్టు పేర్కొన్నారు. స్వచ్ఛంద నిబంధనల అమలును సులభతరం చేసేందుకు వీలుగా.. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన రెండేళ్ల వరకు ఎప్పుడైనా అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించినట్టు చెప్పారు. 2023 మార్చి 31 నాటికి 24.50 లక్షల అప్డేటెడ్ రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. -
ఎగుమతిదారులకు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు అపరిష్కృతంగా ఉన్న పన్ను రిఫండ్ (తిరిగి చెల్లింపులు) రూ.56,027 కోట్ల మొత్తాన్ని విడుదల చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. 45,000 మందికి పైగా ఎగుమతిదారులకు ఈ మొత్తం ఈ ఏడాదే అందనున్నట్టు చెప్పారు. పలు ఎగుమతి ప్రోత్సాహకాల పథకాల కింద (ఎంఈఐఎస్, ఎస్ఈఐఎస్, ఆర్‌వోఎస్‌సీటీఎల్, ఆర్‌వోఎస్‌ఎల్, ఆర్వోడీటీఈపీ) ఈ మొత్తం ఎగుమతిదారులకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. 2021–22లోనే ఇందుకు సంబంధించి చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుమతులకు ఉన్న డిమాండ్‌ను చేరుకునేందుకు, నగదు ప్రవాహాలు పెరిగేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. ఇది రానున్న నెలల్లో బలమైన వృద్ధికి సైతం సాయపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. -
ప్రత్యేక ఆర్థిక జోన్లకూ పన్ను రిఫండ్ పథకం?
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్లకూ (ఎస్ఈజడ్) పన్నులు, సుంకాల రిఫండ్ పథకం– ఆర్ఓడీటీఈపీ (రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడె ప్రొడక్ట్స్) ప్రయోజనాలను వర్తింపజేయాలని ఈఓయూ, ఎస్ఈజడ్ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీఈఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కింద వివిధ ప్రొడక్టులపై విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర సుంకాలు, పన్నులు, లెవీలను ఎగుమతిదారులకు రిఫండ్ జరుగుతుంది. అలాగే ఈ రంగానికి మౌలికరంగం హోదా ఇవ్వాలని కోరింది. తద్వారా ప్రాధాన్యత రంగం కింద తక్కువ రేటుకు ఎస్ఈజడ్లకు బ్యాంకుల నుంచి రుణాల మంజూరు సాధ్యమవుతుందని పేర్కొంది. పెరుగుతున్న ఎగుమతులు జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్ ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఈపీసీఈఎస్ చైర్మన్ భువనేష్ సేథ్ ఆయా అంశాలపై మాట్లాడుతూ, ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 2020–21లో ఎస్ఈజడ్ ఎగుమతుల విలువ రూ.7.55 లక్షల కోట్లుకాగా, 2021–22లో ఈ విలువ రూ.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా కోవిడ్ ముం దస్తు ఎగుమతుల విలువ (2019–20లో రూ.7.84 లక్షల కోట్లు)ను ఈ విభాగం అధిగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి నౌకాశ్రయాలకు రవాణా సౌలభ్యతపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్ఓడీటీఈపీ వివరాలు ఇవీ.. ఆర్ఓడీటీఈపీ స్కీమ్ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ, కేంద్రం ఇటీవలే ఆర్ఓడీటీఈపీ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.12,454 కోట్లు కేటాయించింది. 8,555 ఉత్పత్తులకు వర్తించే విధంగా ఆర్‌ఓడీటీఈపీకి ఈ నిధులను కేటాయించింది. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించిన సుంకాలు, పన్నుల రిఫండ్‌కు ఉద్ధేశించిన ఈ పథకం కింద పన్ను రిఫండ్ రేట్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. వివిధ రంగాలకు సంబంధించి పన్ను రిఫండ్ రేట్లు 0.5 శాతం నుంచి 4.3 శాతం శ్రేణిలో ఉన్నాయి. విద్యుత్ చార్జీలపై సుంకాలు, రవాణా ఇంధనంపై వ్యాట్, వ్యవసాయం, సొంత అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి, మండీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్‌పన్ను వంటి విభాగాల్లో రిఫండ్స్ జరుగుతాయి. రిఫండ్ జరిగే 8,555 ఉత్పత్తుల్లో సముద్ర ప్రాంత ఉత్పత్తులు, దారం, డెయిరీ ప్రొడక్టులు, వ్యవసాయం, తోలు, రత్నాలు–ఆభరణాలు, ఆటోమొబైల్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ ఉన్నాయి. స్టీల్, రసాయనాలు, ఔషధ రంగాలకు మాత్రం ఆర్ఓడీటీఈపీ పథకం వర్తించదు. ఎటువంటి ప్రోత్సాహకాలూ లేకుండా ఈ రంగాలు కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణం. జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం ఇటీవలే ఆర్ఓఎస్సీటీఎల్ స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. ఎస్ఈజడ్లవైపు దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎస్ఈజడ్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణం. దేశం ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం. నేడు కొత్త కార్యాలయం ప్రారంభం దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిమాలయ భవన్లో ఈపీసీఈఎస్ కొత్త కార్యాలయం సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభమవుతుందని చైర్మన్ భువనేష్ సేథ్ తెలిపారు. వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్, వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యంలు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ‘ఎగుమతులు పెంపు, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక వినియోగం, నూతన ఆవిష్కరణలు– ఎస్ఈజడ్లపై ప్రభావం’ అన్న అంశంపై పీడబ్ల్యూసీ నిర్వహించిన ఒక అధ్యయన నివేదికను ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరుగుతుందని కూడా ఆయన వెల్లడించారు. చదవండి : గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ -
15 రోజుల్లోనే ట్యాక్స్ రీఫండ్?
న్యూఢిల్లీ : ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు(ఐటీఆర్) దాఖలు చేసి, రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఐటీఆర్ దరఖాస్తులను వేగంగా పరిశీలించి త్వరగా తిరిగి డబ్బు ఇచ్చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ), ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఇప్పటికే కొంతమంది పన్ను చెల్లింపుదారులకు, రిటర్నులు దాఖలు చేసి, ఈ-వైరిఫై చేపట్టిన అనంతరం 10 నుంచి 15 రోజుల్లో ట్యాక్స్ రీఫండ్స్ వచ్చేశాయని తెలిసింది. ఒకవేళ అంతా బాగుంటే.. పన్ను చెల్లింపుదారులందరికీ.. ఆదాయపన్ను రిటర్న్‌ల రీఫండ్స్ కేవలం 15 రోజుల్లోనే తిరిగి ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆదాయపన్ను రిటర్నుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఇస్తే, దరఖాస్తు పరిశీలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే పదిహేను రోజుల్లో ట్యాక్స్ రీఫండ్ ఇచ్చే విధానం త్వరలో రావొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రిటర్నుల ఈ-వెరిఫికేషన్ పూర్తికాకుంటే పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ ఆలస్యం అవుతుందని తెలిపాయి. అయితే ప్రస్తుతం ఐటీ రిటర్నుల రీఫండ్‌కు నిర్దిష్ట గడువంటూ ఏమీలేదు. దాంతో ట్యాక్స్ రీఫండ్‌కు రెండు వారాల నుంచి రెండు నెలల వరకు సమయం పడుతుంది. ఇది కూడా పన్ను రిటర్నుల దాఖలు బట్టి ఉంటుంది. 15 రోజుల్లో పన్ను రీఫండ్స్ చేయడం సాధ్యమనే తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్ రీఫండ్‌ను ట్యాక్స్ డిపార్మెంటే ఆమోదించాల్సి ఉంటుంది. ఐటీ డిపార్ట్మెంట్ ఆమోదం తర్వాత చివరికి పన్ను చెల్లింపుదారు బ్యాంకు ఖాతాలోకి చెల్లించిన మొత్తంతో పాటు వడ్డీ కూడా వాపసు అవుతుంది. రీఫరెన్స్ నెంబర్‌తో పన్ను చెల్లింపుదారులు, తమ ట్యాక్స్ రీఫండ్‌ను మానిటర్ చేసుకోవచ్చు. -
ట్యాక్స్ రీఫండ్ ఎస్ఎంఎస్.. క్లిక్ చేశారో
మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు తయారైంది ఇటీవల కాలంలో. సైబర్ నేరాలు అంతకంతకు కొత్త కొత్త మార్గాల్లో విజృంభిస్తున్నారే తప్ప, అసలు తగ్గడం లేదు. తాజాగా ఓ సైబర్ క్రైమ్ రాకెట్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే ఎస్ఎంఎస్ రూపంలో పన్ను చెల్లింపుదారులను దగా చేస్తోంది. ఐటీ రిటర్నులకు తుది గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నట్టు సైబర్ నేరగాళ్లు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్‌కు సంబంధించి ఈ ఎస్ఎంఎస్ను పన్నుచెల్లింపుదారులకు సెండ్ చేశారు. తప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తో మీ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్‌ను టార్గెట్ చేశారని ఆ మెసేజ్‌లో చెప్పారు. మీ అకౌంట్ నెంబర్ సరియైనదో కాదో చెక్ చేసుకోవాలని, ఒకవేళ కాకపోతే, మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి, సరిచేసుకోవాలని సైబర్ నేరగాళ్లు కోరారు. ఆ మెసేజ్ నిజంగానే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని భావించి, ఈ లింక్‌ను క్లిక్ చేస్తే, ఇక పన్ను చెల్లింపుదారుల పని అంతే అట. అలా క్లిక్ చేస్తే అచ్చం ఐటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి ఎంట్రి అయినట్టు ఉంటుంది. కానీ అది అధికారిక ఐటీ డిపార్ట్మెంట్ కాదు. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఎంటర్ కావాలని సైబర్ క్రిమినల్స్ కోరతారు. ఆ తర్వాత స్టెపులో బ్యాంక్ అకౌంట్ అకౌంట్ వివరాలు అడుగుతారు. ఆ వెబ్సైట్ నిజమేమో అనుకుని బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేసిన వారు, సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్నారు. దీనిపై నెల క్రితమే కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కొత్త సైబర్ రాకెట్‌పై విచారణ చేపట్టినట్టు సైబర్ క్రైమ్ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు నమోదు చేసిన లాగిన్ వివరాలతో, సైబర్ నేరగాళ్లు ఐటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్లి, వారి ఐటీ ఫండ్స్‌ను తమతమ అకౌంట్లలోకి బదిలీ చేసుకుంటున్నారు. అంతేకాక ఐటీ డిపార్ట్మెంట్ రికార్డుల్లో ఉన్న ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీని కూడా సైబర్ నేరగాళ్లు మార్చేస్తున్నారు. ఈ డేటాను వారు వేరే వాళ్లకి అమ్మేస్తున్నారు కూడా. ఇదే రకమైన కేసును గతేడాది థానే పోలీసులు చేధించారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసు అధికారుల మాదిరి అమెరికన్ సిటిజన్లను మోసం చేసిన భారతీయులను అరెస్ట్ చేశారు. ఈ అనుమానిత మెసేజ్‌లకు స్పందించకుండా దూరంగా ఉండాలని ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను హెచ్చరిస్తోంది. -
తప్పుడు లెక్కలపై తడాఖా
పన్ను రీఫండ్ కోసం ఉద్యోగులు అడ్డదారి 150 మందికి పైగా ఐటీ నోటీసులు పోలీసు, టీటీడీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులే ఎక్కువ తిరుపతి: పన్ను రీఫండ్ కోరుతూ పలువురు ఉద్యోగులు దాఖలు చేసే క్లెరుుమ్స్పై ఆదాయపు పన్నుల శాఖ దృష్టి సారించింది. ఎక్కువ మంది ఉద్యోగులు పన్ను రీఫండ్స కోసం అడ్డదారిలో క్లెరుుమ్స్ ఫైల్ చేస్తున్నారని గుర్తించింది. ఈ తరహా ఉద్యోగుల వివరాలను తెప్పించుకుని వాళ్లు దాఖలు చేసిన రిటర్న్‌లను పరిశీలిస్తోంది. రాంగ్ ఫైలింగ్‌స దాఖలు చేసినట్లు నిర్ధారించుకున్న ఉద్యోగులకు నోటీసులు కూడా జారీ చేస్తోంది. తిరుపతి ఆదాయపు పన్నుల శాఖ కమిషనరేట్ పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లాలో 75 వేలు, నెల్లూరు జిల్లాలో మరో 70 వేల మంది చొప్పున మొత్తం 1.45 లక్షల మంది ఉద్యోగులు ఏటా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. అరుుతే వీరిలో కొంత మంది రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ దగ్గరకు వెళ్లకుండా ఇన్‌కంట్యాక్స్ ప్రాక్టీషనర్స్ లేదా ఆడిటర్ల దగ్గర పనిచేసిన చిన్నాచితకా కమీషన్ ఏజెంట్ల దగ్గరకు వెళ్లి రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కింద మినహారుుంచుకున్న పన్నును తిరిగి పొందేందుకు రిఫండ్ క్లెరుుమ్స్ దాఖలు చేస్తున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగులు సరైన అవగాహన లేక అడ్డదారి తొక్కుతున్నారు. సాధారణంగా సేవింగ్సతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.2.50 లక్షల పై ఆదాయం ఉన్న వారంతా పన్ను చెల్లించాల్సిందే. పీఎఫ్, ఎల్ఐసీ, పీఎల్‌ఐసీ, ఇతరత్రా సేవింగ్స ఉన్న ఉద్యోగులు వాటిని రిటర్న్‌ల సమయంలో పేర్కొంటుంటారు. ఇవి పోను మిగతా ఆదాయానికే పన్ను చెల్లించాల్సి ఉంది. అరుుతే ఈ రెండు జిల్లాల్లోని కొందరు ఉద్యోగులు మాత్రం టీడీఎస్ రిఫండ్‌స కోసం తప్పుడు క్లెరుుమ్స్ చేస్తున్నారు. కమీషన్లకు ఆశపడుతున్న కొందరు ప్రరుువేటు ప్రాక్టీషనర్లు రిఫండ్ వచ్చేలా క్లెరుుమ్ దాఖలు చేస్తామని ఉద్యోగులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఒకరో ఇద్దరికో పన్ను రిఫండ్ చేతికందగానే వారి ద్వారా మిగతా వారంతా ఈ తరహా క్లెరుుమ్స్కు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా టీటీడీ, ఏపీఎస్పీడీసీఎల్, పోలీస్ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ మంది ఈ తరహా రాంగ్ ఫైలింగ్‌స చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు, దీంతో దశల వారీగా నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లోనూ సుమారు 150 మందికి పైగా జారీ చేశారు. ఒకవేళ రాంగ్ ఫైలింగ్‌స అని నిర్థారణ అరుుతే ఆ ఉద్యోగులపై భారీ పెనాల్టీలు విధించడమే కాకుండా వారిని ప్రాసిక్యూట్ చేసే అవకాశాలు కూడా ఉన్నారుు. -
ఎగుమతిదారులకు సకాలంలో ట్యాక్స్ రిఫండ్స్!
ఆర్థికమంత్రి హామీ న్యూఢిల్లీ: ఎగుమతిదారులు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం హామీ ఇచ్చారు. వారికి సకాలంలో, సత్వర ప్రాతిపదికన పన్ను రిఫండ్స్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎగుమతుల పెంపునకూ తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎఫ్ఐఈఓ (ఎగుమతి సంఘాల భారత సమాఖ్య) ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ నేతృత్వంలోని ఒక ప్రతినిధుల బృందం ఆర్థికమంత్రితో సమావేశం అయ్యింది. అనంతరం సమావేశ వివరాలను సమాఖ్య ఒక ప్రకటనలో వివరించింది. ఆయా అంశాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచీ వడ్డీ సబ్సిడీ స్కీమ్ ప్రారంభానికి జోక్యం చేసుకోవాలని ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఆర్థికమంత్రిని కోరారు. -
రెవెన్యూ సెక్రటరీ పోస్టు రద్దు చేయాలి
ఆర్థిక మంత్రికి టార్క్ తొలి నివేదిక న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శి పోస్టు రద్దు... సీబీడీటీ, సీబీఈసీల విలీనం... పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) వినియోగాన్ని విస్తృతపర్చడం... ఇవీ, పన్ను వ్యవస్థ సంస్కరణల కమిషన్(టార్క్) చేసిన కొన్ని సిఫార్సులు. పార్థసారథి షోమ్ సారథ్యంలోని టార్క్ తన తొలి నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది. పన్ను చట్టాలకు పాత తేదీ నుంచి సవరణల అమలుకు స్వస్తిపలకాలని కోరింది. ఆదాయ పన్ను రిటర్నుల్లో సంపద పన్ను వివరాలు కూడా ఉండాలని సూచించింది. ఈ నివేదికలోని కొన్ని సిఫార్సులు... * నిర్ణీతకాలంలో ట్యాక్స్ రిఫండ్ల కోసం బడ్జెట్ కేటాయింపులుండాలి. టీడీఎస్ కోసం పాస్‌బుక్ స్కీమును ప్రవేశపెట్టాలి. * మెరుగైన పన్నుల వ్యవస్థ కోసం సీబీడీటీ, సీబీసీఈల్లో ఎంపిక చేసిన విభాగాలు వెంటనే విలీనం కావాలి. మరో ఐదేళ్లలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఉమ్మడి బోర్డుతో సీబీడీటీ, సీబీసీఈలు ఏకీకృత యాజమాన్యం దిశగా సాగాలి. * కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ఈపీఎఫ్ఓ వంటి ప్రభుత్వ విభాగాలకు సైతం ఉపయోగపడే విధంగా పాన్‌ను కామన్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్ (సీబీఐఎన్)గా మార్చాలి. * ఒకే విభాగం పరిధిలో ఉండే సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్సులకు సింగిల్ రిజిస్ట్రేషన్ అమలు. * సంపద పన్ను రిటర్నులను విడిగా దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఐటీ రిటర్నుల్లోనే వెల్త్ ట్యాక్స్ రిటర్నులను కలపాలి. ట్యాక్స్ రిఫండ్లను నిర్ణీత కాలంలోపు కచ్చితంగా జారీచేయాలి.