తప్పుడు లెక్కలపై తడాఖా
పన్ను రీఫండ్ కోసం ఉద్యోగులు అడ్డదారి
150 మందికి పైగా ఐటీ నోటీసులు
పోలీసు, టీటీడీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులే ఎక్కువ
తిరుపతి: పన్ను రీఫండ్ కోరుతూ పలువురు ఉద్యోగులు దాఖలు చేసే క్లెరుుమ్స్‌పై ఆదాయపు పన్నుల శాఖ దృష్టి సారించింది. ఎక్కువ మంది ఉద్యోగులు పన్ను రీఫండ్‌స కోసం అడ్డదారిలో క్లెరుుమ్స్ ఫైల్ చేస్తున్నారని గుర్తించింది. ఈ తరహా ఉద్యోగుల వివరాలను తెప్పించుకుని వాళ్లు దాఖలు చేసిన రిటర్న్‌లను పరిశీలిస్తోంది. రాంగ్ ఫైలింగ్‌స దాఖలు చేసినట్లు నిర్ధారించుకున్న ఉద్యోగులకు నోటీసులు కూడా జారీ చేస్తోంది.
తిరుపతి ఆదాయపు పన్నుల శాఖ కమిషనరేట్ పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లాలో 75 వేలు, నెల్లూరు జిల్లాలో మరో 70 వేల మంది చొప్పున మొత్తం 1.45 లక్షల మంది ఉద్యోగులు ఏటా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. అరుుతే వీరిలో కొంత మంది రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ దగ్గరకు వెళ్లకుండా ఇన్‌కంట్యాక్స్ ప్రాక్టీషనర్స్ లేదా ఆడిటర్ల దగ్గర పనిచేసిన చిన్నాచితకా కమీషన్ ఏజెంట్ల దగ్గరకు వెళ్లి రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కింద మినహారుుంచుకున్న పన్నును తిరిగి పొందేందుకు రిఫండ్ క్లెరుుమ్స్ దాఖలు చేస్తున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగులు సరైన అవగాహన లేక అడ్డదారి తొక్కుతున్నారు. సాధారణంగా సేవింగ్‌సతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.2.50 లక్షల పై ఆదాయం ఉన్న వారంతా పన్ను చెల్లించాల్సిందే. పీఎఫ్, ఎల్‌ఐసీ, పీఎల్‌ఐసీ, ఇతరత్రా సేవింగ్‌స ఉన్న ఉద్యోగులు వాటిని రిటర్న్‌ల సమయంలో పేర్కొంటుంటారు. ఇవి పోను మిగతా ఆదాయానికే పన్ను చెల్లించాల్సి ఉంది.
అరుుతే ఈ రెండు జిల్లాల్లోని కొందరు ఉద్యోగులు మాత్రం టీడీఎస్ రిఫండ్‌స కోసం తప్పుడు క్లెరుుమ్స్ చేస్తున్నారు. కమీషన్లకు ఆశపడుతున్న కొందరు ప్రరుువేటు ప్రాక్టీషనర్లు రిఫండ్ వచ్చేలా క్లెరుుమ్ దాఖలు చేస్తామని ఉద్యోగులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఒకరో ఇద్దరికో పన్ను రిఫండ్ చేతికందగానే వారి ద్వారా మిగతా వారంతా ఈ తరహా క్లెరుుమ్స్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా టీటీడీ, ఏపీఎస్పీడీసీఎల్, పోలీస్ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ మంది ఈ తరహా రాంగ్ ఫైలింగ్‌స చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు, దీంతో దశల వారీగా నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లోనూ సుమారు 150 మందికి పైగా జారీ చేశారు. ఒకవేళ రాంగ్ ఫైలింగ్‌స అని నిర్థారణ అరుుతే ఆ ఉద్యోగులపై భారీ పెనాల్టీలు విధించడమే కాకుండా వారిని ప్రాసిక్యూట్ చేసే అవకాశాలు కూడా ఉన్నారుు.