ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిఫండ్స్ పొందడానికి ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ సైట్లో తమ బ్యాంకు ఖాతాను రీ వ్యాలిడేట్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. బ్రాంచ్ మార్పులు, ఐఎఫ్ఎస్‌సీ మార్పులు లేదా బ్యాంకు విలీనాల కారణంగా బ్యాంక్ ఖాతా డేటాను అప్డేట్ చేసినప్పుడు రీ వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.
ట్యాక్స్ పేయర్స్ తమ బ్యాంక్ అకౌంట్లను రీ వ్యాలిడేషన్ చేసుకునేందుకు చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్ లో రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి. రీ వ్యాలిడేషన్ చేసే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా పాన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. అలాగే కొత్త బ్యాంకు ఖాతాను జోడించాలన్నా కూడా ఆ ఖాతాను పాన్‌తో లింక్ చేసి ఉండాలి. యూజర్ కు చెల్లుబాటు అయ్యే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, అకౌంట్ నెంబరు ఉండాలి.
ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాను రీవాల్యులేట్ చేయండిలా..
స్టెప్ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండి
స్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3 'బ్యాంక్ అకౌంట్' ఎంచుకుని రీవాలిడేట్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4: అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ, ఏసీ టైప్ వంటి బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయండి.
స్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి.
కొత్త బ్యాంకు అకౌంట్‌ను జోడించడానికి..
స్టెప్ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండి
స్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మై బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయండి (జోడించబడిన, విఫలమైన మరియు తొలగించబడిన బ్యాంక్ అకౌంట్స్ ట్యాబ్ లు డిస్ ప్లే అవుతాయి.)
స్టెప్ 4: బ్యాంక్ ఖాతాను జోడించండి
స్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి.
Kind Attention Taxpayers!
✅Having a validated bank account is essential for receiving of refunds.
✅An already validated bank account will require re-validation after updation of account details consequent to change in branch, IFSC, Merger of bank, etc.
For Updating existing… pic.twitter.com/9DnuSMaYbP— Income Tax India (@IncomeTaxIndia) June 4, 2024
Comments
Please login to add a commentAdd a comment