ఆర్థికమంత్రి హామీ
న్యూఢిల్లీ: ఎగుమతిదారులు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం హామీ ఇచ్చారు. వారికి సకాలంలో, సత్వర ప్రాతిపదికన పన్ను రిఫండ్స్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎగుమతుల పెంపునకూ తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎఫ్‌ఐఈఓ (ఎగుమతి సంఘాల భారత సమాఖ్య) ప్రెసిడెంట్ ఎస్‌సీ రల్‌హాన్ నేతృత్వంలోని ఒక ప్రతినిధుల బృందం ఆర్థికమంత్రితో సమావేశం అయ్యింది. అనంతరం సమావేశ వివరాలను సమాఖ్య ఒక ప్రకటనలో వివరించింది. ఆయా అంశాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచీ వడ్డీ సబ్సిడీ స్కీమ్ ప్రారంభానికి జోక్యం చేసుకోవాలని ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్ ఆర్థికమంత్రిని కోరారు.
ఎగుమతిదారులకు సకాలంలో ట్యాక్స్ రిఫండ్స్!
Published Tue, Jul 7 2015 12:13 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM
Advertisement