various routes
-
సంక్రాంతి స్పెషల్.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–తిరుపతి(07489/07490) స్పెషల్ ట్రైన్ ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుస టిరోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 8.25కు బయలుదేరి ఉదయం 8.50కి హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–తిరుపతి (07449/07450) మరో స్పెషల్ ట్రైన్ ఈ నెల 27వ తేదీ సా. 6.10కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–కాకినాడ (07451/07452) స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న రాత్రి 8.30కు బయలుదేరి మరుసటిరోజు ఉ. 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉ.9కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఇదీ చదవండి: 2023 సామాన్యునికి ఏమిచ్చింది? -
నేడు వివిధ మార్గాల్లో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లా ర్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష, తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
వరుస పండుగలకు సువిధ రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో అదనపు చార్జీలపై సువిధ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ (02285/02286) సువిధ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 17వ తేదీన రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 18వ తేదీ రాత్రి 10.40 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.10 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-కాకినాడ (07427/07428) స్పెషల్ సువిధ ట్రైన్ డిసెంబర్ 29, జనవరి 5 తేదీల్లో సాయంత్రం 7.15 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15 కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 30, జనవరి 6 తేదీల్లో సాయంత్రం 6.10 కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.