వరుస పండుగలకు సువిధ రైళ్లు | suvidha trains in various routes for festivals | Sakshi
Sakshi News home page

వరుస పండుగలకు సువిధ రైళ్లు

Published Fri, Dec 25 2015 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

వరుస పండుగలకు సువిధ రైళ్లు

వరుస పండుగలకు సువిధ రైళ్లు

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో అదనపు చార్జీలపై సువిధ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ (02285/02286) సువిధ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 17వ తేదీన రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు  యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 18వ తేదీ రాత్రి 10.40 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.10 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్-కాకినాడ (07427/07428) స్పెషల్ సువిధ ట్రైన్ డిసెంబర్ 29, జనవరి 5 తేదీల్లో సాయంత్రం 7.15 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15 కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 30, జనవరి 6 తేదీల్లో సాయంత్రం 6.10 కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement