పండగ పూట బంగారం కొనేవారికి పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (జనవరి 13) పసిడి ధరలు మరింతగా పెరిగాయి. నిన్నటి రోజున స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఇంకాస్త ఎగిశాయి.
హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ.320 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.300 ఎగిసింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,270లకు, 22 క్యారెట్ల పుత్తడి తులం ధర రూ. 58,000లకు చేరింది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 62,950, రూ.57,700 ఉండేవి.
బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు ప్రభావితం చేసే ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి.
వెండి కూడా..
Silver Rate: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా పెరిగాయి. మూడు రోజుల నుంచి శాంతించిన వెండి ధరల్లో మళ్లీ పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌తోపాటు ఇరు రాష్ట్రాల్లో వెండి ధర కేజీకి రూ.500 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.78,000 లకు చేరింది. నిన్నటి రోజున కేజీ వెండి ధర రూ.77,500 ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment