గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్ళీ భారీ పెరుగుదల దిశవైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 400 నుంచి రూ. 410 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ రోజు విజయవాడలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5315 (ఒక గ్రామ్), 24 క్యారెట్స్ పసిడి ధర రూ. 5798 (ఒక గ్రామ్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ పసిడి ధరలు వరుసగా రూ. 53150 & రూ. 57980గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 400, రూ. 410 ఎక్కువ. ఇదే ధరలు మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.
చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కావున నిన్నటికి.. ఈ రోజుకి పెద్దగా తేడా లేదు. 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5370 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5858గా ఉంది. ఈ లెక్కన 10 గ్రామ్స్ గోల్డ్ ఖరీదు వరుసగా రూ. 53700 & రూ. 58580గా ఉంది.
ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు..
దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ ఒక గ్రామ్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 5330 & ఒక గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 5813గా ఉంది. దీని ప్రకారం 10 గ్రాముల పసిడి ధర రూ. 53300.. రూ. 58130 గా ఉంది.
వెండి ధరలు
వెండి ధరల విషయానికి వస్తే విజయవాడ, చెన్నై, ఢిల్లీలలో ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. అంటే నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment