• ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఎంపీ కవిత
నేడు రావణ దహనం
Published Mon, Oct 10 2016 10:51 PM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
వినాయక్‌నగర్ :
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్‌లో సాయంత్రం 5 గంటలకు రావణ దహనం నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ భరద్వాజ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎంపీ కవిత ముఖ్య అతిథిగా రానున్నట్లు పేర్కొన్నారు. రావణ దహణ కార్యక్రమంలో నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement