Jagriti
-
పగవాడికి కూడా రావొద్దు ఈ కష్టం
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ముసలి, ముతకా, ఉన్నోడు, లేనోడు ఇలా తారతమ్యాలు లేకుండా కరోనా ప్రతి ఒక్కరిపై తన ప్రతాపం చూపిస్తుండడంతో బ్రతుకు జీవుడా అంటూ క్షణం క్షణం భయం గుప్పిట్లో జనం బతుకుతున్నారు. ఓవైపు కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్‌లు చేయించుకుందామనేలోపే ఊపిరి ఆగిపోతున్న ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల జాగృతి సాఫ్ట్ వేర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే ఆమెకు కరోనా సోకి ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర చికిత్స కోసం ఆమె భర్త తన కారులో ఇంటినుంచి గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వాసుపత్రికి బయలు దేరారు. ఆస్పత్రి బయట పార్కింగ్ ఏరియాలో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో కంగారు పడ్డ ఆమె భర్త పరిగెత్తుకుంటూ వెళ్లి తనకు ఆక్సిజన్ సిలీండర్ కావాలని, తన భార్య ప్రాణాపాయస్థితిలో ఉందని ఆస్పత్రి సిబ్బందని వేడుకున్నాడు. ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో చివరికి ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలని స్ట్రెచ్చర్ కోసం వెతికాడు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. పార్కింగ్ స్థలంలో ఉన్న కారులోనే జాగృతి మరణించింది. బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది ఆమె డెడ్‌బాడీ పట్ల మరింత కాఠిన్యం ప్రదర్శించారు. ప్రోటోకాల్ పేరుతో మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లి దహనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయలేదు.పైగా దహన సంస్కారం చేసే ముందు సుమారు 3 గంటల పాటు తన భార్య జాగృతి మృతదేహాన్ని కారులో అలాగే ఉంచారని బాధితురాలి భర్త కన్నీరుమున్నీరయ్యాడు. -
నేడు రావణ దహనం
• ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఎంపీ కవిత వినాయక్‌నగర్ : దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు రావణ దహనం నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ భరద్వాజ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎంపీ కవిత ముఖ్య అతిథిగా రానున్నట్లు పేర్కొన్నారు. రావణ దహణ కార్యక్రమంలో నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. -
పోలీసు కస్టడీకి బీఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ: పని మనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, ఆయన భార్య జాగృతిలను విచారించేందుకు స్థానిక కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిన దృశ్యాల్లో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు వీరి కస్టడీ అవసరమన్న పోలీసుల వాదనకు ఓకే చెప్పింది. ఈ నెల ఐదున తమ ఇంటిలోని పనిమనిషి రాఖీ భద్ర మృతి కేసులో అరెస్టయిన ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్పూర్ నియోజకవర్గ ఎంపీ ధనంజయ్, ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో దంత వైద్యురాలు జాగృతిల జ్యుడీషియల్ కస్టడీ పూర్తవడంతో శనివారం పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వీరిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే వీరి వాదనలు విన్న కోర్టు రెండు రోజుల విచారణకు మాత్రమే అనుమతించింది. అయితే నవంబర్ ఒకటి, నాలుగు తేదీల మధ్యలో ధనంజయ్ ఢిల్లీలోనే లేరని ఆయన తరఫు న్యాయవాది హరిహరన్ వాదించారు. గత రెండేళ్ల నుంచి దక్షిణ ఆవెన్యూ 175లోనే ధనంజయ్ ఉండటం లేదన్నారు. ఇప్పటికే ఐదు రోజులు పాటు పోలీసులు విచారించారని, కావున మళ్లీ కస్టడీకి ఇవ్వాల్సిన అసరం లేదని వాదించారు. -
హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి ఎంపీ దంపతులు
న్యూఢిల్లీ: పనిమనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, భార్య జాగృతిను స్థానిక న్యాయస్థానం నాలుగురోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. పోలీస్ కస్టడీ గడువు ముగియడంతో ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న జాగృతి, ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ ఎంపీ ధనంజయ్లను శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గోమతి మనోచా ఎదుట పోలీసులు హాజరుపరిచారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల రాఖీ భద్ర హత్యకు గురవడంతో ఈ నెల ఐదో తేదీన పోలీసులు జాగృతి అరెస్టుచేసిన సంగతి విదితమే. ఈ ఘటనకు సంబంధించి ఫోరెనిక్స్ విభాగం అందజేసే నివేదిక అనంతరం జాగృతి మరికొన్ని రోజులు పోలీస్ కస్టడీని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పనిమనిషిని తీవ్రంగా హింసించిన ఎంపీ భార్య జాగృతి