న్యూఢిల్లీ: పనిమనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్‌పీ ఎంపీ ధనంజయ్ సింగ్, భార్య జాగృతిను స్థానిక న్యాయస్థానం నాలుగురోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. పోలీస్ కస్టడీ గడువు ముగియడంతో ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న జాగృతి, ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ ఎంపీ ధనంజయ్‌లను శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గోమతి మనోచా ఎదుట పోలీసులు హాజరుపరిచారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల రాఖీ భద్ర హత్యకు గురవడంతో ఈ నెల ఐదో తేదీన పోలీసులు జాగృతి అరెస్టుచేసిన సంగతి విదితమే. ఈ ఘటనకు సంబంధించి ఫోరెనిక్స్ విభాగం అందజేసే నివేదిక అనంతరం జాగృతి మరికొన్ని రోజులు పోలీస్ కస్టడీని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి ఎంపీ దంపతులు
Published Mon, Nov 11 2013 7:25 PM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM
Advertisement