బీఎస్పీ ఎంపీ దంపతుల కస్టడీ పొడిగింపు
Published Thu, Dec 5 2013 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
న్యూఢిల్లీ: పని మనిషి హత్య కేసులో నిందితులైన బీఎస్‌పీ ఎంపీ ధనుంజయ్‌సింగ్, అతని భార్య జాగృతి సింగ్‌ల జ్యుడీషియల్ కస్టడీ కోర్టు పొడిగిం చింది. నిందితుల న్యాయవాది ఈ విషయాన్ని ప్రొడక్షన్ వారంట్ జారీ చేసిన మెట్రోపాలిటన్ మేజి స్ట్రేట్ గోమమతి మనోచ తెలిపారు. నిందితులు డిసెంబర్ 3వ తేదీ వాయిదాకు హాజరు కాకపోవడాన్ని ప్రశ్నించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఈ విషయం తెలిపారు. తీహార్ జైలు మేజిస్ట్రేట్ నిందితుల జ్యుడీషియల్ కస్టడీని డిసెంబర్ 16వ తేదీ వరకు పొడిగించారన్నారు. ధనుంజయ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్‌కు చెందిన బీఎస్‌పీ ఎంపీ కాగా, జాగృతి రాంమనోహర్ లోహియా హాస్పిటల్‌లో దంతవైద్యురాలు.
పనిమనిషి రాఖీభద్ర హత్య కేసులో ఈ ఇద్దరిని నవంబర్ 5వ తేదీన అరెస్టు చేశారు. ధనుంజయ్ సింగ్ ఇప్పటికే హత్య, మాఫియా నిరోధక చట్టం కింద కేసులు ఎదుర్కొంటున్నాడు. పనిమనిషి కేసులో సాక్ష్యాలను నిర్మూలించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ భార్య జాగృతి మీద ఐపీసీ 302, 307, 344 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తీహార్ జైలులో ఉన్న ధనుంజయ్‌సింగ్ బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 20వ తేదీన మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసింది. తదనంతరం సెషన్స్ కోర్టులో పిటిషన్ వేయగా అదనపు సెషన్స్ జడ్జి ధర్మేశ్‌శర్మ కొట్టివేశారు.
Advertisement