బీఎస్పీ ఎంపీ బెయిల్‌కు నో | no bail for bsp mp dhananjay | Sakshi
Sakshi News home page

బీఎస్పీ ఎంపీ బెయిల్‌కు నో

Published Sun, Feb 23 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

బీఎస్పీ ఎంపీ బెయిల్‌కు నో

బీఎస్పీ ఎంపీ బెయిల్‌కు నో

 న్యూఢిల్లీ: పనిమనిషి హత్య కేసులో బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్‌కు బెయిల్ ఇవ్వడానికి స్థానిక కోర్టు శనివారం తిరస్కరించింది. బాధితుల కంటే నిందితులు ఉన్నతస్థాయిలో ఉన్న వాళ్లు కాబట్టి ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి లోకేశ్ కుమార్ శర్మ స్పష్టం చేశారు.

 

సాక్షులను బెదిరించే అవకాశాలనూ తోసిపుచ్చలేమన్నారు. ఇక ఈ కేసులో పోలీసులు సింగ్, ఆయన భార్య జాగృతిపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో వీరిద్దరినీ గత నవంబర్‌లో అరెస్టు చేశారు. హత్యాయత్నం, సాక్ష్యాల విధ్వంసం తదితర అభియోగాలతో వీరిద్దరిపై ఫిబ్రవరి ఒకటిన చార్జిషీటు దాఖలయింది. కేసు ఇరు వర్గాల వాదనలను మార్చి 21 నుంచి వింటామని న్యాయమూర్తి ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement