ప్రవేశం ఉచితం..
ప్రతి గంటకు గిప్ట్ కూపన్ శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగే మెగా ఆటోషోను సందర్శించే వారికి ప్రవేశం ఉచితం. ఆటో షోలో వాహన ప్రియులు తమ కుటుంబ సమేతంగా పాల్గొని, ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. చందన రమేష్ గ్రూప్‌వారి సౌజన్యంతో సందర్శకులకు గంట గంటకు ఉచిత గిప్ట్ కూపన్ ఇవ్వనున్నారు. 93.5 రెడ్ ఎఫ్‌ఎం రెడియో పార్టనర్‌గా, సాక్షి, టీవీ న్యూస్ చానల్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి.
రాజమహేంద్రవరం : మూడేళ్లుగా మెగా ఆటోషోలను ఏర్పాటు చేస్తూ వాహన ప్రియుల కలలను సాకారం చేసిన ’సాక్షి’ మెగా ఆటో షో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. శని, ఆదివారాల్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రెండు రోజులపాటు జరగనున్న ఈ మెగా ఆటో షోను రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్, నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీ శేషసాయి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధిచిన ఏర్పాట్లు నిర్వాహకులు పూర్తి చేశారు.
నచ్చిన వాహనం.. ఫైనా ఒకేచోట
నచ్చిన వాహనం కోసం షోరూంలన్నీ తిరగాలంటే సాధ్యమైన పనికాదు ఆ శ్రమ అవసరం లేకుండా అన్నీ ఈ మెగా షోలో లభించనున్నాయి.
పాల్గొననున్న కంపెనీ డీలర్స్
యమహా సిరి మోటార్స్, శ్రీ సిరి ఆటో మొబైల్స్, ఎస్బీ మోటార్స్, ట్రైస్టార్ ఫోర్డ్, కంటిపూడి నిస్సాన్, కంటిపూడి డాట్సన్, కంటిపూటి సుజుకి, రెడ్డి బాబు హీరో, సీపీ రెడ్డి హీరో, శ్రీఆర్‌కే హోండా, టర్బో ఫియట్, చవ్రలెట్ ఆరెంజ్ ఆటో మెబైల్స్, టాటా శ్రీ కోడూరి ఆటో మొబైల్స్, లీలాకృష్ణ టయోట, రేనాల్ట్ విశ్వరూప ఆటోమోటీవ్స్, ఎలైట్ హోండా, లక్ష్మి హూండాయ్, గోకుల్ టీవీఎస్ టూ వీలర్, కోడూరి పియోజియో త్రీవీలర్ ఆటో, మహీంద్ర ఎంఅండ్‌ఎం మోటార్స్, దాక్షాయిని టీవీఎస్ వంటి ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలన్నింటినీ ఒకే వేదికపైకి ’సాక్షి’ తీసుకువస్తుంది. వందలాది సరికొత్త, ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వాహనాలు ఈ మెగా ఆటో ఎక్స్‌పోలో కొలువుదీరనున్నాయి.
రుణ సదుపాయం
నచ్చిన వాహనాన్ని వెంటనే వినియోగదారుడు సొంతం చేసుకోవచ్చు. బ్యాంకర్ల ద్వారా సులభతరమైన వాయిదా పద్ధతులు, తక్షణ రుణ సదుపాయాన్ని (స్పాట్ ఫైనాన్స్) పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సదుపాయాలు అందిస్తోంది.
యమహా ఫ్యాసినో సొంతం చేసుకోండి
’సాక్షి’ మెగా ఆటో షోలో వాహనం బుక్ చేసుకున్నవారికి బంపర్ ఆఫర్ డ్రాలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సిరి మోటార్స్ సౌజన్యంతో బంపర్ డ్రాలో యమహా ఫ్యాసినో బహుమతిగా గెలుసుకోవచ్చు. యమహా స్కూటర్ కొనుగోలు చేసిన మొదటి 10 మందికి ఉచితంగా యాక్ససరీస్ అందజేస్తారు.
నేడు, రేపు ‘సాక్షి’ మెగా ఆటో షో
Published Fri, Nov 4 2016 11:58 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement