షో..అదుర్స్‌ | mega auto show | Sakshi
Sakshi News home page

షో..అదుర్స్‌

Published Sun, Nov 6 2016 11:29 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

షో..అదుర్స్‌ - Sakshi

షో..అదుర్స్‌

  • ‘సాక్షి’ మెగా షోకు విశేష స్పందన 
  • భారీగా వాహనాల విక్రయం 
  • రెండు రోజులపాటు సందడిగా మారిన ఆర్ట్స్‌ కాలేజీ మైదానం
  • సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన డీలర్లు, సందర్శకులు 
  • ‘సాక్షి’ మెగా ఆటోషో అదిరింది. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీ మైదానం ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. స్పోర్ట్, స్కూటీల వద్ద యువత సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ’సాక్షి’ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించిన ఈ మెగా ఆటో షో రాజమహేంద్రవరం వాసులకు కొత్త అనుభూతిని పంచింది. నచ్చిన వాహనం కొనుగోలు చేసేందుకు ఎక్కడికో వెళ్లనవసరం లేకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా అన్ని రకాల వాహనాలనూ ఒకే చోటకు తెచ్చిన ఈ మెగా ఆటో షో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మనసులను దోచుకుంది. పలువురు వాహనాలను కొనుగోలు చేయగా, మరికొంత మంది అడ్వా¯Œ్సలు ఇచ్చి తమకు నచ్చిన వాహనాలను బుక్‌ చేసుకున్నారు. 
    – సాక్షి, రాజమహేంద్రవరం  
     
    ‘సాక్షి’ ఆధ్వర్యంలో తొలిసారి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మెగా ఆటోషో విజయవంతమైంది. ఈ షోకు ఉభయగోదావరి జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రెండు రోజులపాటు ఆర్ట్స్‌ కాలేజీ మైదానం సందర్శకులతో కిటకిటలాడింది. ఈ రెండు రోజుల్లో మొత్తం 95 వాహనాలు ఆయా కంపెనీల డీలర్లు విక్రయించారు. ఇందులో 58 టూవీలర్లు, 30 కార్లు, 7 ఆటోలు ఉన్నాయి. విశాల మైదానంలో ప్రదర్శన ఏర్పాటు చేయడంతోపాటు సౌకర్యాలు కల్పించడంపై డీలర్లు, సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆటోషోలో ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంక్‌లు తక్కువ వడ్డీకే రుణసదుపాయం కల్పించాయి. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పార్కింగ్, ఇతర సౌకర్యాలను ‘సాక్షి’ అడ్వర్టయిజింగ్‌ ఏజీఎం బి.రంగనాథ్, ఆర్‌ఎం వైఎస్‌ కొండలరావు, అడ్వర్టయిజింగ్‌ డిప్యూటీ మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు, సీనియర్‌ యాడ్‌ ఆఫీసర్‌ కె.ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.  
     
    తక్కువ డౌ¯ŒSపేమెంట్‌
    ‘సాక్షి’ మెగా ఆటోషోలో వాహనం కొనుగోలు చేసిన వారికి అతి తక్కువ డౌ¯ŒSపేమెంట్‌ ఆఫర్‌ ఇచ్చాం. ఫైనా¯Œ్స కూడా అప్పటికప్పుడు పూర్తి చేశాం. 
    – సీహెచ్‌.సన్యాసిరావు, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్, రెడ్డిబాబు మోటార్స్‌ 
    ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు
    ఈ ప్రదర్శనలో వాహనం కొనుగోలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇచ్చాం. తక్కువ డౌ¯ŒSపేమెంట్, రెండేళ్ల పాటు ఉచిత ఇన్సూరె¯Œ్స ఇస్తున్నాం. 
    – జి.వినయ్‌కుమార్, శ్రీగోకుల్‌ టీవీఎస్‌ 
    సందర్శకులకు టేబుల్‌టాప్‌ కేలండర్‌
    ‘సాక్షి’ మెగా ఆటోషో మా వ్యాపారానికి బాగా ఉపయోగపడింది. మా స్టాల్‌ను సందర్శించిన వారికి వారి ఫొటోతో కూడిన టేబుల్‌ క్యాలెండర్‌ ఇచ్చాం.
    – సుజిత్, టీమ్‌ లీడర్, సిరి మోటార్స్‌ 
    ప్రచారానికి ఎంతో మేలు
    ఇలాంటి మెగా ఆటోషోలు నూతన వాహనాల ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ‘సాక్షి’ ఇలాంటివి మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాం. మేము నాలుగు వాహనాలు విక్రయించాం. 
    – ప్రవీణ్, సేల్స్‌ మేనేజర్, కంటిపూడి సుజుకి 
    డ్రైవింగ్‌ స్కూల్‌ గురించి వివరించాం 
    ’సాక్షి’ మెగా ఆటోషో మా కంపెనీ ప్రచారానికి బాగా ఉపయోగపడింది. మా డ్రైవింగ్‌ స్కూల్‌ గురించి సందర్శకులకు వివరించాం. రాజమహేంద్రవరం, కాకినాడల్లో మా డ్రైవింగ్‌æ స్కూళ్లు ఉన్నాయి. 
    – సూర్య, టీమ్‌ లీడర్, ఎస్‌బీ మోటార్స్‌.  
    స్పాట్‌ ఎక్సే్ఛంజ్‌ ఇచ్చాం
    ఈ మెగా ఆటోషోలో కొనుగోలుదారులకు స్పాట్‌ ఎక్సే్ఛంజ్‌ ఇచ్చాం. పాత వాహనాలకు గరిష్ట మార్కెట్‌ ధర ఇస్తున్నాం. ’సాక్షి’ మెగా ఆటోషో కొనుగోలుదారులకు, మాకు ఎంతో ఉపయోగపడింది. 
    – కిరణ్‌కుమార్, సేల్స్‌ మేనేజర్, శ్రీకోడూరి టాటా 
    సందర్శకులకు ప్రత్యేక గిఫ్ట్‌
    మా స్టాల్‌ సందర్శించిన వారికి ప్రత్యేక గిఫ్ట్‌ ఇచ్చాం. చవర్లెట్‌æ ఎ¯ŒSజాయ్‌ వాహనంపై ప్రత్యేక డిస్కౌంట్‌ రూ. రెండు లక్షలు ఇస్తున్నాం. ఇది నెలాఖరు వరకు ఉంటుంది. 
    – దుర్గాప్రసాద్, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్, ఆరెంజ్‌ చవర్లెట్‌
    యాక్ససరీస్‌ ఆఫర్‌ కొనసాగిస్తున్నాం
    ‘సాక్షి’ మెగా ఆటోషోలో కొనుగోలుదారులకు రూ.పది వేలు విలువైన యాక్ససరీస్‌ ఇచ్చాం. ఈ ఆఫర్‌ను ఇక్కడికి వచ్చిన సందర్శకులకు షోరూంలో కూడా ఇవ్వాలని నిర్ణయించాం.
    – వంశీ శ్రీనివాస్, ఎస్‌.ఎం, లీలాకృష్ణ టయోటా.
    యాక్ససరీస్‌ ఉచితం
    ’సాక్షి’ మెగా ఆటోషోలో వాహనాలు కొనుగోలు చేసిన వారికి రూ.8 వేల విలువైన యాక్ససరీస్‌ ఉచితంగా ఇస్తున్నాం. అన్ని మోడళ్లపై డిస్కౌంట్‌లు ఉన్నాయి. 
    – బీహెచ్‌వీ ప్రసాద్, సేల్స్‌ ఆఫీసర్, ఎలైట్‌ హోండా 
    అపే సిటీ లాంచ్‌ చేశాం
    ’సాక్షి’ మెగా ఆటో షోలో అపే సిటీ కొత్త ఆటోను లాంచ్‌ చేశాం. ఇప్పటి వరకూ రెండు వాహనాలు విక్రయించాం. ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఇస్తున్నాం. ఇక్కడ పార్కింగ్‌ బాగుంది. 
    – రాయుడు, సేల్స్‌ మేనేజర్, కోడూరి పియోజియో
     
    స్నేహితుడితో వచ్చి టూ వీలర్‌ కొన్నా 
    నా స్నేహితుడు కారు కొనుగోలు చేద్దామంటే వచ్చా. ఇక్కడ వాహనాలన్నీ పరిశీలించాక ఇంట్లో వారందరికీ ఉపయోగంగా ఉంటుందని స్కూటీ కొనుగోలు చేశా. ఫైనా¯Œ్స ప్రక్రియ 30 నిమిషాల్లో పూర్తయింది. ‘సాక్షి’ మెగా ఆటో షో చాలా ఉపయోగంగా ఉంది.
    – ఎల్‌.దామోదర్, రావులపాలెం 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement