రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి సంవత్సరం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో గెజిట్ పబ్లిక్ హాలిడేస్‌తోపాటు ముఖ్యమైన పండుగలు ఉంటాయి. అయితే ఈ జాబితాలో ప్రాంతీయ పండుగలు, సందర్భాలను బట్టి రాష్ట్రాల వారీగా సెలవులు ఉండవు.
ఆర్బీఐ జాబితా ప్రకారం.. 2024 ఫిబ్రవరిలో మొత్తం 11 బ్యాంకు సెలవులు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం బ్యాంకులు పనిచేస్తాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి దృష్ట్యా మహారాష్ట్ర అంతటా బ్యాంకులు పనిచేయవు. మిగతా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు సోమవారం సాధారణ పని దినం ప్రకారం పనిచేస్తాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని శివ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర అంతటా జరుపుకుంటారు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ సెలవు దినం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న పండుగలా జరుపుకుంటారు. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు.
ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే..
- ఫిబ్రవరి 4 - ఆదివారం
- ఫిబ్రవరి 10- రెండవ శనివారం
- ఫిబ్రవరి 11- ఆదివారం
- ఫిబ్రవరి 14- బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో సెలవు)
- ఫిబ్రవరి 15- లూ-నాగి-ని (మణిపూర్‌లో సెలవు)
- ఫిబ్రవరి 18- ఆదివారం
- ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు)
- ఫిబ్రవరి 20- రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో సెలవు) ఫిబ్రవరి 24- రెండవ శనివారం
- ఫిబ్రవరి 25- ఆదివారం
- ఫిబ్రవరి 26- న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు)
Comments
Please login to add a commentAdd a comment