ఈ వారంలో బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించే వారికి ఇది ముఖ్యమైన సమాచారం. సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాతి వారంలోనూ బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు.
దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని జాతీయ బ్యాంకులు ఏప్రిల్ 9 మంగళవారం గుడి పడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం బోహాగ్ బిహు, ఈద్, ఏప్రిల్ 11 గురువారం రంజాన్, ఏప్రిల్ 13 రెండవ శనివారం, ఏప్రిల్ 14 ఆదివారం ఇలా.. ఈ ఐదు రోజుల పాటు మూత పడనున్నాయి.
మరోవైపు ఏప్రిల్ 15, 16 తేదీలలో వరుసగా బోహాగ్ బిహు, రామ నవమి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. మరింత స్పష్టత కోసం కస్టమర్లు సమీపంలోని బ్యాంక్ శాఖలను సంప్రదించవచ్చు. ఆయా రాష్ట్రాల్లో సెలవుల జాబితాను ఆర్బీఐ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment