bank holiday
-
సెలవులో మార్పు.. ఆర్బీఐ కీలక ప్రకటన
మహారాష్ట్ర ప్రభుత్వం ఈద్-ఈ-మిలాద్‌కు సంబంధించిన పబ్లిక్ హాలిడేను మార్చింది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంక్ హాలిడేను సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 18కు మార్చినట్లు వెల్లడించింది.సెప్టెంబర్ 18న సెలవు కాబట్టి ఆ రోజు గవర్నమెంట్ సెక్యూరిటీలు, ఫారెన్ ఎక్స్చేంజ్, మనీ మార్కెట్, రూపీ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్‌లలో ఎలాంటి లావాదేవీలు, సెటిల్మెంట్లు ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ లావాదేవాలన్నీ కూడా సెప్టెంబర్ 19న యధావిధిగా జరుగుతాయని సమాచారం.ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఈద్-ఇ-మిలాద్ ఒక ముఖ్యమైన వేడుక. దీనిని ముహమ్మద్ పుట్టినరోజు, నబీ దినోత్సవం లేదా మౌలిద్ అని కూడా అంటారు. భారతదేశంలో ఇది ప్రభుత్వ సెలవుదినంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ సందర్భాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ఏకంగా 14 రోజులు! హాలిడే ఒక్క మహారాష్ట్రలో మాత్రమే కాకుండా గుజరాత్, మిజోరం, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, జమ్మూ, కేరళ, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు వర్తిస్తాయి. అంటే ఆ రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు ఆ రోజు పనిచేయవు (మహారాష్ట్రలో 18న సెలవుదినం, ఇతర రాష్ట్రాల్లో 16 సెలవుదినం అని తెలుస్తోంది). కాబట్టి బ్యాంకుకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే ముందుగానే సెలవు గురించి తెలుసుకుని పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. -
Bank holiday : ఈరోజు బ్యాంకులు పనిచేస్తాయా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి సంవత్సరం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో గెజిట్ పబ్లిక్ హాలిడేస్తోపాటు ముఖ్యమైన పండుగలు ఉంటాయి. అయితే ఈ జాబితాలో ప్రాంతీయ పండుగలు, సందర్భాలను బట్టి రాష్ట్రాల వారీగా సెలవులు ఉండవు. ఆర్బీఐ జాబితా ప్రకారం.. 2024 ఫిబ్రవరిలో మొత్తం 11 బ్యాంకు సెలవులు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం బ్యాంకులు పనిచేస్తాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి దృష్ట్యా మహారాష్ట్ర అంతటా బ్యాంకులు పనిచేయవు. మిగతా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు సోమవారం సాధారణ పని దినం ప్రకారం పనిచేస్తాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని శివ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర అంతటా జరుపుకుంటారు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ సెలవు దినం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న పండుగలా జరుపుకుంటారు. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఫిబ్రవరి 4 - ఆదివారం ఫిబ్రవరి 10- రెండవ శనివారం ఫిబ్రవరి 11- ఆదివారం ఫిబ్రవరి 14- బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో సెలవు) ఫిబ్రవరి 15- లూ-నాగి-ని (మణిపూర్‌లో సెలవు) ఫిబ్రవరి 18- ఆదివారం ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు) ఫిబ్రవరి 20- రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో సెలవు) ఫిబ్రవరి 24- రెండవ శనివారం ఫిబ్రవరి 25- ఆదివారం ఫిబ్రవరి 26- న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు) -
22న సెలవు.. బ్యాంకులకూ వర్తిస్తుందా?
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఈనెల 22న (సోమవారం) అత్యంత వైభవోపేతంగా జరగబోతోంది. ఈ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాయి. మరోవైపున కేంద్ర ప్రభుత్వం సైతం తమ ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలకు హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. అయితే మరి బ్యాంకుల మాటేమిటి? బ్యాంకులన్నింటికీ ఈ హాఫ్ హాలీడే వర్తిస్తుందా అన్నది ఇక్కడ తెలుసుకుందాం. ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. అయోధ్యలోని రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు, సంబంధిత పుణ్యకార్యాల్లో పాల్గొనేందుకు వీలుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు ఆరోజున సెలవు ఇచ్చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్నం వరకూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు సెలవు ప్రకటించింది. బ్యాంకులకు వర్తిస్తుందా? ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలే కాబట్టి ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. జనవరి 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఆయా బ్యాంకులన్నీ మూతబడి ఉంటాయి. మధ్యాహ్నం 2.30 తర్వాత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, గ్రామీణ బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. ఇక ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే ఆర్బీఐ సెలవుల జాబితాలో జనవరి 22 లేదు కాబట్టి ఆరోజును పనిదినంగా పరిగణించాలి. ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల పనివేళల్లో ఎలాంటి మార్పు ఉండదు. -
2024లో బ్యాంక్ సెలవులు ఇవే..
ఒకప్పుడు బ్యాంక్‌కు వెళ్లనిదే పనులు జరిగేవి కావు. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు మెబైల్లోనే దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. ఖాతా తెరవడం దగ్గర నుంచి ఇతరులకు నగదు పంపించడం వరకు చాలా పనులు దీంతోనే చెక్కబెట్టేస్తున్నారు. అయితే, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలన్నా, లాకర్లో వస్తువులు దాయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఏదైనా పని మీద బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే.. ముందుగా ప్లాన్ చేసుకోవాలి. తీరా ఆ రోజు సెలవు అని తెలిస్తే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. కాబట్టి బ్యాంకు శాఖలు పనిచేసే రోజులు తెలుసుకోవాలి. తాజాగా కొత్త ఏడాదికి సంబంధించి ఆర్బీఐ సెలవు తేదీలను ప్రకటించింది. సంక్రాంతి, మహా శివరాత్రి, దీపావళి వంటి పండగలు, ఆదివారాలు, ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. ఆయా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. 2024లో బ్యాంకు సెలవులు ఇలా ఉన్నాయి.. జనవరి.. జనవరి 1- సోమవారం- నూతన సంవత్సరం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు జనవరి 11- గురువారం- మిషనరీ డే- మిజోరం జనవరి 12- శుక్రవారం- స్వామి వివేకానంద జయంతి- బంగాల్ జనవరి 13- రెండో శనివారం/లోహ్రి- దేశవ్యాప్తంగా సెలవు జనవరి 14- ఆదివారం- సంక్రాంతి- దేశవ్యాప్తంగా హాలిడే ఉంది. జనవరి 15- సోమవారం- పొంగల్, తిరువళ్లూర్ డే- తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో సెలవు జనవరి 16- మంగళవారం- తుసు పూజ- బంగాల్, అసోంలో సెలవు జనవరి 17- బుధవారం- గురు గోవింద్ సింగ్ జయంతి- పలు రాష్ట్రాల్లో సెలవు జనవరి 23- మంగళవారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి- పలు రాష్ట్రాల్లో ఉంది. జనవరి 25- గురువారం- స్టేట్ డే- హిమాచల్ ప్రదేశ్ జనవరి 26- శుక్రవారం- రిపబ్లిక్ డే- దేశవ్యాప్తంగా సెలవు జనవరి 27- నాలుగో శనివారం- దేశవ్యాప్తంగా సెలవు జనవరి 31- బుధవారం- మి-డామ్-మే-ఫి- అసోం ఇదీ చదవండి: దేన్నీ వదలని ‘డీప్‌ఫేక్’ ముఠా..! ఫొటోలు వైరల్ ఫిబ్రవరి.. ఫిబ్రవరి 10- రెండో శనివారం ఫిబ్రవరి 15- గురువారం- లుయ్-ఎంగయ్-ని - మణిపుర్ ఫిబ్రవరి 19- సోమవారం- శివాజీ జయంతి- మహారాష్ట్ర ఫిబ్రవరి 24- నాలుగో శనివారం మార్చి.. మార్చి 8- శుక్రవారం- మహాశివరాత్రి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు) మార్చి 23- శనివారం- భగత్ సింగ్ మార్టిర్డమ్ డే - పలు రాష్ట్రాల్లో సెలవు మార్చి 25- సోమవారం- హోలీ (గెజిటెడ్ హాలిడే) మార్చి 29- గుడ్‌ఫ్రైడే- శుక్రవారం (గెజిటెడ్ హాలిడే) ఏప్రిల్.. ఏప్రిల్ 9 - మంగళవారం- ఉగాది - కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో సెలవు ఏప్రిల్ 10- ఈద్- ఉల్- ఫితుర్- బుధవారం (గెజిటెడ్ హాలిడే) ఏప్రిల్ 13- రెండో శనివారం ఏప్రిల్ 14- ఆదివారం- అంబేడ్కర్ జయంతి- దేశవ్యాప్తంగా సెలవు ఏప్రిల్ 17- శ్రీరామనవమి- బుధవారం- చాలా రాష్ట్రాల్లో సెలవు ఏప్రిల్ 21- ఆదివారం ఏప్రిల్ 27- నాలుగో శనివారం ఇదీ చదవండి: ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే.. మే.. మే 1- బుధవారం- దేశవ్యాప్తంగా సెలవు (మే డే) మే 11- రెండో శనివారం మే 25- నాలుగో శనివారం జూన్.. జూన్ 8 - రెండో శనివారం జూన్ 16- ఆదివారం జూన్ 22- నాలుగో శనివారం జులై.. జులై 13- రెండో శనివారం జులై 17- బుధవారం- మొహర్రం- దేశవ్యాప్తంగా సెలవు (కొన్ని రాష్ట్రాల్లో మినహా) జులై 27- నాలుగో శనివారం ఆగస్టు.. ఆగస్టు 10- రెండో శనివారం ఆగస్టు 15- గురువారం- స్వాతంత్య్ర దినోత్సవం- దేశవ్యాప్తంగా సెలవు ఆగస్టు 19- సోమవారం- రాఖీ- యూపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా ఆగస్టు 24- నాలుగో శనివారం ఆగస్టు 26- సోమవారం- కృష్ణాష్టమి- చాలా రాష్ట్రాల్లో సెప్టెంబర్.. సెప్టెంబర్ 7 - శనివారం- వినాయక చవితి- దేశవ్యాప్తంగా సెలవు సెప్టెంబర్ 8- ఆదివారం సెప్టెంబర్ 16- సోమవారం- ఈద్- ఇ- మిలాద్- దేశవ్యాప్తంగా సెలవు సెప్టెంబర్ 28- నాలుగో శనివారం. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? అక్టోబర్.. అక్టోబర్ 2- గాంధీ జయంతి- దేశవ్యాప్తంగా సెలవు- బుధవారం అక్టోబర్ 10- మహాసప్తమి- గురువారం- దేశవ్యాప్తంగా సెలవు అక్టోబర్ 11- మహా అష్టమి- శుక్రవారం- పలు రాష్ట్రాల్లో అక్టోబర్ 12- రెండో శనివారం- విజయదశమి అక్టోబర్ 26- నాలుగో శనివారం నవంబర్.. నవంబర్ 9 - రెండో శనివారం నవంబర్ 23- నాలుగో శనివారం డిసెంబర్.. డిసెంబర్ 14- రెండో శనివారం డిసెంబర్ 25- బుధవారం- క్రిస్మస్- దేశవ్యాప్తంగా సెలవు డిసెంబర్ 28- నాలుగో శనివారం -
బ్యాంకులకు వరుస సెలవులు.. నోట్ల ఇక్కట్లు
అమరావతి: వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ప్రజలు నగదు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగోవ శనివారం, ఆదివారం సెలవులకు తోడు సోమవారం ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపునివ్వడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో నగదు తీసుకోవడానికి ఏటీఎంలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఉన్న ఏటీఎంలలో మూడోవంతు పనిచేయడం లేదు. దీంతో గత రెండు రోజులతో పోలిస్తే ఉన్న ఏటీఎంల వద్ద క్యూలైన్లు భారీగా పెరిగాయి. ఏటీఎంల నుంచి రోజుకు రూ. 2,500 నగదు తీసుకోవడానికి అవకాశం ఉన్నా రెండువేల నోట్లు మాత్రమే ఉంటుండటంతో అంతకుమించి తీసుకోవడానికి అవకాశం ఉండటం లేదు. రెండు రోజుల సెలవులను దృష్టిలో పెట్టుకొని ఏటీఎంలలో అధిక నగదును నింపామని, ఒకవేళ అవి అయిపోతే సోమవారం వరకు ఆగాల్సిందేనని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం బంద్ అయినా అన్ని బ్యాంకులు పనిచేస్తాయని, ఒకవేళ ఎవరైనా వచ్చి బలవంతంగా మూసివేయిస్తే మాత్రం ఏమీ చేయలేమంటున్నారు. సోమవారం బ్యాంకులను తప్పకుండా తెరవాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు.