
పండుగ సీజన్‌లో రోజురోజుకి పెరుగుతున్న పసిడి ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ. 150 (22 క్యారెట్స్) నుంచి రూ. 160 (24 క్యారెట్స్) తగ్గింది.
ఈ రోజు విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 5495 & 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5995గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ఒక గ్రామ్ మీద రూ. 15 నుంచి రూ. 16 వరకు తగ్గింది. దీని ప్రకారం 10 గ్రాముల పసిడి ధర రూ. 54950 & రూ. 59950గా ఉంది. ఇదే ధరలు హైదరాబాద్, గుంటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.
చైన్నైలో నేటి బంగారం ధరలు రూ. 150 నుంచి రూ. 160 వరకు తగ్గి రూ. 55,150 (10 గ్రామ్స్ 22 క్యారెట్ గోల్డ్), రూ. 60,160గా (10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్) ఉన్నాయి. వెండి ధరలు కేజీ మీద రూ. 500 తగ్గి రూ. 77,000 వద్ద ఉంది.
ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు!
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 55,100 & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 60,100గా ఉంది. వెండి ధరలు కేజీ మీద రూ. 500 తగ్గి రూ. 73,600 వద్ద ఉంది.