
జనవరి 3 నుంచి వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు 12వ తేదీ నుంచి పెరుగుదల వైపు అడుగులు వేసాయి. అయితే ఈ రోజు మళ్ళీ తులం గోల్డ్ మీద రూ. 100 నుంచి రూ. 110 వరకు తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా పసిడి ధరలు తగ్గాయి. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 58050 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 63330గా ఉన్నాయి.
చెన్నై ఈ రోజు పసిడి ధరలు వరుసగా రూ. 200 నుంచి 220 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63820కు చేరింది. ఢిల్లీలో ఈ రోజు ధరలు రూ. 100 నుంచి రూ. 110 తగ్గి తులం బంగారం ధరలు వరుసగా రూ. 58200 (22 క్యారెట్స్), రూ. 63480 (24 క్యారెట్స్)కు చేరింది.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీలలో కేజీ మీద రూ. 300 తగ్గింది.