అవసరం లేకున్నా తమ జేబులు నింపు కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖలో కొందరు అత్యవసర పదోన్నతులకు తెర తీశారు. ఉన్నవారిని సర్దుబాటు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ సొమ్ములు దక్కవనే ముందుచూపుతో పదోన్నతులకు సై అన్నారు. ఈ వ్యవహారంలో
-
వైద్య, ఆరోగ్య శాఖలో చేతులు మారిన లక్షలు
-
నేడు కౌన్సెలింగ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
అవసరం లేకున్నా తమ జేబులు నింపు కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖలో కొందరు అత్యవసర పదోన్నతులకు తెర తీశారు. ఉన్నవారిని సర్దుబాటు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ సొమ్ములు దక్కవనే ముందుచూపుతో పదోన్నతులకు సై అన్నారు. ఈ వ్యవహారంలో గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. ఈ అవినీతి బాగోతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలో జో¯ŒS–2 పరిధిలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలున్నాయి. వీటిల్లో ప్రభుత్వం 33 పీహెచ్‌సీలను కొత్తగా ప్రారంభించింది. ఈ 33 చోట్ల ఎంపీహెచ్‌ఈవో(మేల్)లను నియమించాల్సి ఉంది. ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో 9 పీహెచ్‌సీలున్నాయి. ఈ నియామకానికి వైద్య, ఆరోగ్య శాఖ ఆర్డీ కార్యాలయం సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈ 33 పీహెచ్‌సీలతో పాటు మరో మూడు పదవీ విరమణ జరిగే పోస్టులు కూడా ఉన్నాయి. కొత్తగా మంజూరైన పీహెచ్‌సీలకు ఇతరచోట్ల అదనంగా ఉన్న ఎంపీహెచ్‌ఈవోలతో సర్దుబాటు చేసే అవకాశం ఉంది. చాలా పీహెచ్‌సీల్లో ముగ్గురి నుంచి ఆరుగురి వరకూ ఉన్నారు. ఒకరిద్దరు ఉంటే సరిపోయేచోట కూడా అదనంగా ఉన్నారు. వీరిని సర్దుబాటు చేయడానికి బదులు ‘ప్రయోజనాలు’ ఆశించి, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. సూపర్‌వైజర్లుగా పని చేస్తున్నవారికి ఎంపీహెచ్‌ఈవో ప్రమోషన్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ జాబితాలో గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న సూపర్‌వైజర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా 13 మందితో జాబితా కూడా తయారుచేశారు. జీవో నంబర్–68 ప్రకారం గిరిజనుల్లో అర్హులైనవారికి పదోన్నతుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ కులధ్రువీకరణ పత్రం అందజేయలేదనే సాకుతో మొత్తం గిరిజనుల జాబితానే బుట్టదాఖలు చేశారు. వారికి పదోన్నతులు ఇవ్వడం వల్ల కలిసొచ్చేది ఏమీ ఉండదనే ఉద్దేశంతోనే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల స్వప్రయోజనాలకు తాము పదోన్నతులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అర్హులైన 15 మంది గిరిజన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒక్కో పోస్టుకు రూ.లక్ష పైగా వెనకేసుకున్నారని ఉద్యోగవర్గాలు విమర్శిస్తున్నాయి. ఒక్క మన జిల్లాలోని తొమ్మిది పీహెచ్‌సీలకు సంబంధించే ఎంపీహెచ్‌ఈవో పదోన్నతుల కోసం రూ.10 లక్షల వరకూ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఆర్డీ కార్యాలయంలోని ఒక ఉద్యోగి ఈ వ్యవహారమంతా చక్కబెడుతున్నాడన్న ఆరోపణలుÐ వస్తున్నాయి.
ఇంత హడావుడిగా ఎందుకో?
ప్రస్తుతం సూపర్‌వైజర్లంతా స్వచ్ఛ విద్యావాహిని కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. త్వరలో పల్స్‌పోలియో కూడా చేపట్టనున్నారు. ఈ తరుణంలో సూపర్‌వైజర్లకు హడావుడిగా పదోన్నతులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఉద్యోగవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పీహెచ్‌సీల్లో అదనంగా ఉన్న ఎంపీహెచ్‌ఈవోలను సర్దుబాటు చేస్తే పదోన్నతుల అవసరమే ఉండదంటున్నారు. కేవలం తమ జేబులు నింపుకొనేందుకే హడావుడిగా ఈ పక్రియను చేపట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క రేషనలైజేష¯ŒS ప్రక్రియ చేపట్టకుండానే పదోన్నతులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఈ పోస్టుల సర్దుబాటు జటిలమవుతుందని పలువురు అంటున్నారు.