వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒS రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడంబరాలు పక్కన పెట్టి పేద వర్గాలకు చేయూతనిచ్చే
-
నేడు వైఎస్సార్ సీపీ అధినేత జగ¯ŒS జన్మదిన వేడుకలు
-
ప్ర«ధాన ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు
-
వృద్ధులకు రగ్గుల పంపిణీ, పలు సేవా కార్యక్రమాలు
-
విజయవంతం చేయాలని కన్నబాబు పిలుపు
కాకినాడ :
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒS రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడంబరాలు పక్కన పెట్టి పేద వర్గాలకు చేయూతనిచ్చే సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడానికి కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని అన్నవరం సత్యనారాయణస్వామి, అయినవిల్లి సిద్ధివినాయక, కోరుకొండ లక్షీ్మ నరసింహస్వామి ఆలయాల్లో పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం సాగిస్తున్న అధినేతకు మరింత శక్తి సామర్థ్యాలు ప్రసాదించి ఉద్యమించేలా ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ఈ కార్యక్రమాలను తలపెట్టారు. వచ్చే ఎన్నికల్లో జగ¯ŒS ముఖ్యమంత్రి కావడం ద్వారా దివంగత నేత వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ఆశీర్వదించాలని సర్వమత ప్రార్థనలు చేయనున్నారు.
రగ్గులు పంపిణీకి చర్యలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో బుధవారం జగ¯ŒS పేద వృద్ధులకు రగ్గులు పంపిణీ చేయనున్నట్టు పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ చెప్పారు. ఆయా మండలాల్లోని యువజన విభాగానికి చెందిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులంతా రగ్గుల పంపిణీతోపాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే ఆలయాల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయాలన్నారు.
సేవా కార్యక్రమాలు చేపట్టాలి : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పార్టీ శ్రేణులు అంతా పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో పుట్టినరోజు జరపాలన్నారు. ప్ర«ధానంగా ఆయా ప్రాంతాల్లో పేద వర్గాలను, వృద్ధులను ఆదుకొనేందుకు ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.