HDFC Bank Mega Merger To Be Effective July1st In HDFC Bank, Details Inside - Sakshi
Sakshi News home page

HDFC-HDFC Bank Merger: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం!

Published Sat, Jul 1 2023 8:38 AM | Last Updated on Sat, Jul 1 2023 9:14 AM

HDFC merger in hdfc bank today - Sakshi

HDFC Merger: భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్​ ఫైనాన్స్​ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ (HDFC) ప్రైవేట్‌ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో ఈ రోజు (జులై 01) విలీనం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గతంలోనే వెల్లడైంది, కానీ ఈ రోజు ఇరు కంపెనీల బోర్డుల ఆమోదంతో మర్జర్​కు లైన్​ క్లియర్​ అవుతుంది.

దేశంలోనే తొలి హోమ్ ఫైనాన్స్​ సంస్థగా పేరు పొందిన హెచ్​డీఎఫ్​సీ ఇక కనిపించదు. ఇప్పటికే హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సంస్థలు స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అయిన విషయం తెలసిందే. కావున రికార్డ్​ డేట్ తరువాత హెచ్​డీఎఫ్​సీ షేర్​హోల్డర్లకు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లను కేటాయిస్తారు.

(ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - వివో వై36 నుంచి వన్‌ప్లస్ నార్డ్ వరకు..)

సంబంధిత అధికారులు నాన్​ కన్వర్టెబుల్​ డిబెంచర్స్​ బదిలీకి జులై 12, హెచ్​డీఎఫ్​సీ కమర్షియల్​ పేపర్స్​ను హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ పేరుకు బదిలీ చేసేందుకు జులై 7న డేట్​ను ఫిక్స్​ చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి హెచ్​డీఎఫ్​సీ తన పేరెంట్ కంపెనీ అయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో కలవడానికి సుముఖత చూపింది. కాగా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.

(ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!)

నివేదికల ప్రకారం.. మార్చి 2023 నాటికి, హెచ్​డీఎఫ్​సీ & హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వ్యాపార విలువ రూ. 41 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో లాభాలు రూ. 60 వేల కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక త్వరలో హెచ్​డీఎఫ్​సీలోని ఉద్యోగులందరు, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఉద్యోగులుగా మారిపోతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement