ఆర్థిక శాఖ, ఆర్బీఐ అత్యవసర సమావేశం | Long queues, 40 per cent ATMs working: Government, RBI meet today to ease transition | Sakshi
Sakshi News home page

ఆర్థిక శాఖ, ఆర్బీఐ అత్యవసర సమావేశం

Published Sat, Nov 12 2016 1:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

ఆర్థిక శాఖ, ఆర్బీఐ అత్యవసర సమావేశం

ఆర్థిక శాఖ, ఆర్బీఐ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ: ఏటీఎం సెంటర్లు  పనిచేయడం లేదన్న ఆందోళనలపై కేంద్రం స్పందించింది. నగదు తక్షణ కొరత పరిష్కరించే అంశంపై చర్చించి, తగిన చర్యలు  చేపట్టేందుకు  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా  నేడు(శనివారం) సమావేశం కానున్నాయి. ఒకవైపు ఏటీఎం సెంటర్ల దగ్గర బారులు తీరిన ప్రజలు, క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచున్నా  నిరాశే ఎదురవు తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై  చర్చించేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ రంగంలో కిదిగింది. సరిపడా కొత్త నోట్ల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ఆందోళన అవసరం  లేదని భరోసా ఇస్తోంది.  

తగినంత కొత్త కరెన్సీ అందుబాటులో ఉన్నప్పటికీ, నిర్వహణ లో సమస్యలు, సమయానికి ఏటీఎంలలో  నిల్వ చేయడంలో లోపంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.  బ్యాంకు అధికారులకు ఎదురవుతున్న సమస్యలు, ఇతర అంశాలపై  ఈ సమావేశంలో చర్చించనున్నట్టు  చెప్పారు.  రూ .3 లక్షల కోట్ల విలువచేసే (1.5 బిలియన్ )  రూ.2 వేల రూపాయల నోట్లకు చలామణికి సిద్ధంగా ఉంచినట్టు, అలాగే మరో 3లక్షలకోట్ల నోట్లను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. దీంతోపాటుగా 6 లక్షల అధికారిక రూ .2,000 నోట్లను (3 బిలియన్లు) నెలాఖరు నిల్వతో  "తగినంత డబ్బు ఉంది" ఆయన స్పష్టం చేశారు.

కాగా పెద్దనోట్ల రద్దుతో ఏటీఎం కేంద్రాలు, బ్యాంకులకు పరుగులు తీస్తున్న ప్రజలకు  చుక్కలు కనిపిస్తున్నాయి.  బారులుతీరిన లైన్లు, నో సర్వీస్ బోర్డులు  దర్శినమిస్తుండడంతో సామాన్య  ప్రజల్లో కలకలం మొదలైంది.  40 శాతం  ఏటీఎంలు పనిచేస్తున్నాయని  కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement